AP | ఢీ అంటే ఢీ..

AP | ఢీ అంటే ఢీ..

  • మొదలైన కోళ్ల పందేలు

AP | కాళ్ళ, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండగ మొదలైన సందర్భంగా భోగి రోజు సంప్రదాయబద్ధంగా వస్తున్న కోడి పందేలు మొదలయ్యాయి. కాళ్ళ మండలం పెదఅమిరంలో సంప్రదాయంగా వస్తున్న కోడి పందేలను ఉపసభాపతి రఘురాం కృష్ణంరాజు, శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. రఘురాం కృష్ణంరాజు మాట్లాడుతూ.. కోళ్లకు కత్తులు కట్టకుండా డింకీ పందేలు మాత్రమే వేస్తున్నామన్నారు. ప్రజలందరూ సంప్రదాయబద్ధంగా వస్తున్న పండగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని కోరారు.

ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సంక్రాంతి సందర్భంగా సిటీలంతా ఖాళీగా మారాయని, పల్లెల్లో సంప్రదాయ బద్ధంగా వస్తున్న పండగను జరుపుకోవడానికి ప్రజలందరూ పల్లెలకు చేరాలన్నారు. రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు తన సహచరుడు, మిత్రుడు అయిన రఘురామ కృష్ణంరాజు ఆహ్వానం మేరకు సంప్రదాయబద్ధమైన కోళ్ల పందేలు చూడడానికి వచ్చామని తెలిపారు. ప్రజలందరూ కూడా పండగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీగల కృష్ణారావు తెలంగాణ నుంచి అతిథిగా ఈ కోళ్ల పందేలు చూడడానికి పాల్గొన్నారు. పందేలను చూడడానికి చుట్టుపక్కల గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply