AP | నీటి సంఘాల సమావేశం..

AP | నీటి సంఘాల సమావేశం..
AP | మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నం నియోజకవర్గం నీటి సంఘాల అధ్యక్షుల సమావేశంలో గూడూరు మండల డిసి చైర్మన్ పోతన స్వామి నాయుడు పాల్గొన్నారు. నీటి భద్రత భూగర్భ జలాల పై దృష్టి సాధించాలని అన్నారు. ఐదేళ్ల వైసిపి పాలనలో అన్ని రంగాల కంటే సాగునీటి రంగమే తీర విధ్వంసానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి నిర్వహణలో రైతు ప్రతినిత్యం లేకుండా సాగునీటి సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు గత ప్రభుత్వం తప్పిదాలను సరి చేసుకుంటూ సాగునీటి సంఘాలకు పూర్వ వైభోగం కల్పించారన్నారు. రైతులను భాగస్వాములను చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి దక్కుతుంది అన్నారు. వైసిపి పాలనలో సాగునీటి సంఘాలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే నాధుడే కరువయ్యాడు అని పేర్కొన్నారు. సాగునీటి సంఘాల లేకపోవడంతో నీటి నిర్వహణ పూర్తిగా కరువై పంట పొలాలు దెబ్బతిన్నాయని విమర్శించారు
