AP | ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో..

AP | ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో..

  • ఘనంగా సంక్రాంతి వేడుకలు
  • బోగి మంటలతో ప్రారంభమైన ఉత్సవాలు..
  • భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు

AP | (ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సంక్రాంతి పండుగ వేడుకలు సంప్రదాయబద్ధంగా, అత్యంత వైభవంగా ఇవాళ‌ నిర్వహించబడుతున్నాయి. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ అధికారులు ఈ ఉత్సవాలను శాస్త్రోక్తంగా చేశారు.

ఇవాళ‌ తెల్లవారుజామున 5 గంటలకు శ్రీ మహాగణపతి స్వామి ఆలయం వద్ద బోగి మంటలతో సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్‌, కార్యనిర్వహణాధికారి (ఈవో), పాలకమండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

AP

బోగి మంటల అనంతరం గంగిరెద్దుల విన్యాసాలు, బొమ్మల కొలువు వంటి సంప్రదాయ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగలో భాగంగా మకర సంక్రాంతి, కనుమ రోజుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.

AP

ఈ వేడుకలు ఆలయ ఛైర్మన్‌ బోర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె.సీనా నాయక్‌ల ఆధ్వర్యంలో పర్యవేక్షణలో జరగగా ఈ కార్యక్రమంలో అవ్వారు శ్రీనివాస రావు, గూడపాటి వెంకట సరోజిని దేవి, జింకా లక్ష్మీదేవి, మన్నే కలవతి, మోరు శ్రావణి, పద్మావతి ఠాకూర్, పానబాక భూలక్ష్మి, పెనుంసెట్సా రాఘవ రాజు, సుబ్రమణ్య కుమార్ యలేశ్వరంపు, సుకుసి సరిత, తంబల్లపల్లి రామదేవి, మార్తి రామ బ్రహ్మం, వెలకుపూడి శంకర బాబు పాల్గొన్నారు.

AP

ఆలయ వైదిక కమిటీకి చెందిన స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ, అర్చకులు శ్రీధర్ శర్మతో పాటు ఆలయ సిబ్బంది, వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారి కృపతో భక్తులందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Leave a Reply