వైభవంగా శ్రీ సీతారామ మందిర పునః ప్రతిష్ట..

వైభవంగా శ్రీ సీతారామ మందిర పునః ప్రతిష్ట..

నూతన విగ్రహాల ప్రతిష్టా మహోత్సవం
భక్తుల జయ జయ ధ్వానాల నడుమ ప్రతిష్ట వేడుకలు

ఘంటసాల, ఆంధ్రప్రభ : మండలం శ్రీకాకుళం గ్రామంలోని రజక పేట పునర్నిర్మితమైన శ్రీ హనుమత్ లక్ష్మణ పరివార సహిత శ్రీ సీతారామ స్వామి మందిరము నందు శ్రీ హనుమత్ లక్ష్మణ పరివార సహిత శ్రీ సీతారామ స్వామి మరియు గణేష, నాగరాజ స్వామి వార్ల నూతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవం శనివారం ఉదయం భక్తుల జయ జయ ద్వానాల నడుమ వైభవంగా నిర్వహించారు

ఉదయం 8.01 గంటలకు విషక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రణయణం, ప్రధాన హోమాలు, ధాతున్యాసము, రత్నన్యాసము సుముహూర్తమునకు *బింబ ప్రతిష్ట, కుంభ కళావాహనం, దేను దర్శనం, మహా పూర్ణాహుతి, *ధృవ కళ్యాణము* జరిగింది. ఉదయం 10.08 గంటలకు శ్రీస్వామి వార్ల విగ్రహాలు ప్రతిష్ట జరిగింది. పంచాయతీ కార్యదర్శి కొల్లిపర రామకోటేశ్వరరావు దంపతులు, యస్వంత్ – ప్రసన్న దంపతులు, అదిరాల లక్ష్మణ్ – నాగలక్ష్మిలు పీటల మీద కూర్చుని క్రతువు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమ గుండాల వద్ద వేద పండితులు ప్రతిష్ట మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక హోమ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరామాంజనేయ రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పర్యవేక్షణ చేశారు. వందలాది మంది భక్తులు ఈ మహోత్సవాల్లో పాల్గొన్నారు.

Leave a Reply