ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు

మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు..
ప్రార్థనల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
సోదరభావానికి పిలుపు

ఆంధ్రప్రభ నందిగామ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈద్గా ప్రార్థనల్లో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం అక్కడికి విచ్చేసిన ముస్లిం సోదర సోదరీమణులకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సమాజంలో శాంతి, సౌహార్దం నెలకొనాలని ఆకాంక్షించిన ఆయన, పర్వదినాలు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలవాలని పేర్కొన్నారు. ఉపవాస దీక్షలు ఆధ్యాత్మిక విలువలను పెంపొందిస్తాయని చెప్పారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరూ ఐక్యతతో ముందుకు సాగాలని మొండితోక జగన్ మోహన్ రావు పిలుపునిచ్చారు.

Leave a Reply