అందరి పైన అల్లా కృప..

అందరి పైన అల్లా కృప..

ముస్లిం సోదర సోదరీమణులకు శుభాభినందనలు
శాంతి, సౌభాగ్యాల కోసం ప్రార్థనలు.
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.

తిరువూరు, ఆంధ్రప్రభ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరువూరు నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన సందేశంలో అల్లాహ్ కృపతో ప్రజలు ఆరోగ్యం, ఐశ్వర్యంతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, ప్రార్థనలు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపాలని, ప్రతి ఇంటా శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని కోరుకున్నారు. ముస్లిం సోదరులందరికీ మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆకాంక్షించారు.

Leave a Reply