బాలుడిపై వీధి కుక్కలు దాడి..

బాలుడిపై వీధి కుక్కలు దాడి..

మూడురోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనే..
వీధి కుక్కల నియంత్రణలో అధికారుల మీనమేషాలు..

గుంటూరు కార్పొరేషన్, ఆంధ్రప్రభ: నల్లచెరువు ప్రాంతంలో వీధి కుక్కల బెడద మళ్లీ తీవ్రరూపం దాల్చింది. మంగళవారం తెల్లవారుజామున షేక్ మొహిన్ అక్రమ్ (7) అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడికి గొంతు వద్ద తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)కు తరలించారు. ఇటీవల వరుసగా జరుగుతున్న కుక్కల దాడులతో నల్లచెరువు ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించేందుకు స్థానికులు సిద్ధమవుతున్నారు.

Leave a Reply