అండర్-19 ఎంపిక ట్రయల్స్..

అండర్-19 ఎంపిక ట్రయల్స్..
కే డి సి ఏ ఆధ్వర్యంలో
మార్చి 19న విజయవాడలో నిర్వహణ
ఆసక్తి గల యువ క్రికెటర్లకు ఆహ్వానం
విజయవాడ, ఆంధ్రప్రభ : యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించే దిశగా కృష్ణా డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-19 (పురుషులు) జట్టు ఎంపిక ట్రయల్స్ నిర్వహించనున్నట్లు సంఘం కార్యదర్శి ఎం . రవీంద్ర Chowdary తెలిపారు. ఈ ట్రయల్స్ ఈ నెల 19న ఉదయం 7 గంటలకు విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 2026-27 సీజన్‌కు సంబంధించి జిల్లా జట్టును ఎంపిక చేయడానికి ఈ ట్రయల్స్ జరుగుతాయని ఆయన వెల్లడించారు. అండర్-19 విభాగానికి ఎంపిక కావాలనుకునే అభ్యర్థులు 2007 సెప్టెంబర్ 1 లేదా ఆ తరువాత జన్మించినవారు అయి ఉండాలని నిర్వాహకులు తెలిపారు.

అర్హత కలిగిన యువ క్రికెటర్లు ట్రయల్స్‌కు హాజరుకావచ్చని సూచించారు. ట్రయల్స్‌కు వచ్చే అభ్యర్థులు తమ జనన తేదీ ధృవీకరణ పత్రం (ఫారమ్-5), ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు. అలాగే తెలుపు రంగు క్రికెట్ దుస్తులు, సరైన స్పోర్ట్స్ షూస్, స్వంత క్రికెట్ కిట్ మరియు రెడ్ బాల్ తీసుకురావాలని సూచించారు. జిల్లా స్థాయి క్రికెట్లో ప్రతిభ కనబరిచే యువ క్రీడాకారులకు ఈ ఎంపిక ట్రయల్స్ మంచి అవకాశంగా నిలుస్తాయని సంఘం వర్గాలు పేర్కొన్నాయి.
