రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ స్థల సేకరణ..

రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ స్థల సేకరణ..
రాష్ట్ర ప్రభుత్వ నుండి నిధుల మంజూరుకై కృషి
హామీ ఇచ్చిన రాష్ట్రమంత్రి ఎన్.ఎం.డి ఫరూక్…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల నుంచి దూల పల్లెకు ఇతర గ్రామాలకు వెళ్ళటానికి సుమారుగా ఏడు సంవత్సరాల నుంచి కోసం పోరాటం కొనసాగిస్తున్న మనీ నూనెపల్లె ప్రాంత అభివృద్ధి కార్యాచరణ కమిటీ పేర్కొంది. ఆదివారం రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. పల్లె ప్రాంత అభివృద్ధి కార్యాచరణ కమిటీ కన్వీనర్ ప్రముఖ న్యా యవాది మాజీ కౌన్సిలర్ శంకరయ్య తోట ధనుంజయుడు బాల హుస్సేనయ్య గౌడ్ లు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూనెపల్లె ప్రాంతంలో 1995 సంవత్సరంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగిందన్న రు.
నూనెపల్లె ప్రాంత వ్యవసాయదారులకు, పశుపోషకులకు, 9 కౌన్సిల్ వార్డు ప్రజలు సుమారు 50 వేల మంది మరియు గ్రామాల నుంచి నంద్యాల పట్టణానికి వెళ్లే వేలాది మంది ప్రజలు ప్రతిరోజు రైల్వే ట్రాక్ దాటడం వలన కష్టాలకు, ప్రమాదాలకు గురి అవుతున్నారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.గత ఏడు సంవత్సరాల నుండి రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికై ప్రజలు పోరాడుతున్నారు. ప్రభుత్వాలు మారిన సమస్యలు మాత్రం పరిష్కారము కాలేదని వాపోయారు. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆర్డిఓ , మున్సిపల్ కమిషనర్ , రైల్వే అడిషనల్ డివిజన్ ఇంజనీర్ లు ఈ ప్రాంతాన్ని పరిశీలించి ప్లాన్ కూడా రూపొందించరు.

రైల్వే డి ఆర్ ఎం కు సంబంధిత వివరాలు పంపగా, గుంటూరు వెస్ట్ రైల్వే డివిజనల్ ఇంజనీరు ఈ ప్రాంతంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణము అవసరం ఉన్నదని నివేదిక కూడా పంపారు.ఈ ప్రాంతంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి ఉన్నందున భూమిని సేకరించి ఇచ్చిన యెడల రైల్వే నిధులతో రైల్వే అండర్ టన్నల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టుతామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కు ఎందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా పంపివున్నారు. రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ స్థల సేకరణకు గాను సుమారు 6 కోట్ల రూపాయలు అవసరం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి నిధులు రాబడతారని నూనెపల్లి ప్రాంత అభివృద్ధి కార్యాచరణ కమిటీకి హామీ ఇవ్వడం జరిగినదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నూనెపల్లి ప్రాంత అభివృద్ధి కార్యచరణ కమిటీ కన్వీనర్, ప్రముఖ న్యాయవాది మాజీ కౌన్సిలర్ శంకరయ్య తోట ధనుంజయుడు, బాల హుస్సేనయ్య గౌడ్, సింహాద్రి రామ్మూర్తి, తోట భూపాల్, తోట సురేష్, రజని, రామస్వామి, తోట పెద్ద మద్దిలేటి, జి నగేష్ , రహిమాను, వెంకటసుబ్బయ్య, బాబు, నాగరత్నం తదితరులు మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
