AP | 22 మంది విద్యార్థులకు గాయాలు

AP | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : సెవెంత్ డే ప్రైవేటు పాఠ‌శాల బ‌స్సు బోల్తా పడడంతో 22 మంది విద్యార్థులకు గాయాలైన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని అల‌జంగి వ‌ద్ద జరిగిన ప్రమాదంలో గాయ‌ప‌డిన విద్యార్థుల‌ను వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది. బస్సు బోల్తా ప‌డ‌టానికి గ‌ల కార‌ణాలు వంటి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

AP

Leave a Reply