AP | తీర ప్రాంత భద్రతపై సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ..

AP | తీర ప్రాంత భద్రతపై సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ..
AP | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా దేశంలోకి చొరబడకుండా కట్టడి చేయడమే లక్ష్యంగా సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీ మచిలీపట్నం చేరుకుంది. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ సోమవారం చీరాలకు బయలుదేరింది. ఈ సందర్భంగా మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణాజిల్లా అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి సీఐఎస్ఎఫ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ… సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులే దేశానికి మొదటి రక్షణ కవచమని అన్నారు. సముద్రం ద్వారా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు దేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తే వెంటనే పోలీసులకు లేదా భద్రతా బలగాలకు సమాచారం అందించాలని మత్స్యకారులకు అవగాహన కల్పించడమే ఈ సైకిల్ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. తీర ప్రాంతాల్లో గ్రామ గ్రామాన తిరుగుతూ మత్స్యకారులను కలుస్తూ, దేశ భద్రతలో వారి కీలక పాత్రను వివరించేందుకు ఈ ర్యాలీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దేశ రక్షణకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశం ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు.
