AP | సింగపూర్ బృందం మచిలీపట్నంలో పర్యటన..

AP | సింగపూర్ బృందం మచిలీపట్నంలో పర్యటన..
AP | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : సింగపూర్ బృందం మచిలీపట్నంలో బబుధవారం పర్యటించారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో సింగపూర్ బృందంకు జిల్లా కలెక్టర్ డీకే.బాలాజీ స్వాగతం పలికారు. బుధవారం కృష్ణాజిల్లా అభివృద్ధిలో భాగంగా పోర్ట్ పనులను పరిశీలించటానికి నలుగురు సభ్యులతో కూడిన సింగపూర్ బృందం మచిలీపట్నం విచ్చేసారు. వారికి కలెక్టర్ పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. 40 శాతం పైగా పూర్తి చేసుకున్న మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను సింగపూర్ బృందం పరిశీలించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
