AP | ధనుర్మాసం ప్రీతికరమైనది

AP | ధనుర్మాసం ప్రీతికరమైనది

AP | గంపలగూడెం, ఆంధ్రప్రభ : శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైన ధనుర్మాస ఉత్సవాలు మండలంలో గత 20 రోజులుగా భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ రోజు గంపలగూడెం శ్రీరామ భజన మందిరం, ఊటుకూరు శ్రీ కోదండ రామస్వామి ఆలయం, నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, గంపలగూడెం కోదండ రామాలయం, పెనుగొలను రంగనాయక స్వామి ఆలయం, గోసవీడు మదన వేణుగోపాలస్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోదాదేవి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. మహిళలు పాల్గొని తిరుప్పావై పాశురం ఆలపించారు. ఊటుకూరు శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో వికాస తరంగిణి అధ్యక్షురాలు సముద్రాల జ్యోతి, ఉప అధ్యక్షురాలు వెచ్చా సుధారాణి, సభ్యులు పాల్గొని తిరుప్పావై ఆలపించారు.

Leave a Reply