ADB | జన్నారం నూతన ఎస్సైగా అనూష నియామకం

ప్రస్తుత ఎస్సై రాజవర్ధన్ ఆకస్మికంగా బదిలీ


జన్నారం, జూన్ 3 (ఆంధ్రప్రభ) : జన్నారం నూతన ఎస్సైగా గొల్లపెల్లి అనూషను రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా నియమిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ పనిచేసిన గుండేటి రాజవర్ధన్ ను సీపీ కార్యాలయానికి వీఆర్ కు అటాచ్ గా ఆకస్మికంగా బదిలీ చేస్తూ ఆదేశించారు.

ఇక్కడ పనిచేసిన రాజవర్ధన్ 2024 మార్చ్ 16న బాధ్యతలు స్వీకరించి, జూన్ 2 వరకు పనిచేశారు. ఎస్సై రాజవర్ధన్ ను ఆకస్మికంగా బదిలీ చేశారు. ఆయన ఎస్సైగా ఇక్కడ పనిచేసిన 14 నెలల‌ కాలంలో అటు అధికారుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ, ప్రజలతోనూ ప్రజాప్రతినిధులతో మ‌మేకమై మంచిపేరు తెచ్చుకొని, మన్ననలు పొందారు. గంజాయిని సేవించే యువకులకు కౌన్సిలింగ్ ఇస్తూ నిర్మూలించడంలోనూ, వాహన దొంగలను పట్టుకోవడంలోనూ, శాంతి భద్రతల పరిరక్షణలోనూ ఆయన మంచి చొరవ చూపారు.

Leave a Reply