ANR | కళాశాలతో ఎనలేని అనుబంధం

ANR | కళాశాలతో ఎనలేని అనుబంధం
- గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
- ఘనంగా ప్రారంభమైన ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు
- తొలి రోజు జరిగిన రైతు సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే రాము…
- కళాశాల ఆవిర్భావానికి కారణమైన రైతులకు ప్రయోజనకరంగా…
- రైతు సదస్సు నిర్వహించడం అభినందనీయం: ఎమ్మెల్యే రాము
- రైతాంగ శ్రేయస్సుకు శాస్త్రవేత్తలు నిర్వహించే…
- కార్యక్రమాలకు అన్ని విధాలుగా సహకరిస్తా: ఎమ్మెల్యే రాము
ANR | గుడివాడ, ఆంధ్రప్రభ : ఏఎన్ఆర్ కళాశాల పూర్వ విద్యార్థినైన తనకు కళాశాలతో (College) ఎనలేని అనుభవం ఉందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కళాశాల ఆవిర్భావానికి కారణమైన రైతులకు ప్రయోజనకరంగా వజ్రోత్సవ వేడుకల్లో రైతు సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. గుడివాడలో ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యాయి. 16,17,18 తేదీల్లో మూడు రోజులు పాటు జరగనున్న వేడుకల తొలిరోజు రైతు సదస్సు నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, వ్యవసాయ శాస్త్రవేత్తలకు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. సదస్సులో భాగంగా రైతులకు ఉపయోగకరంగా వివిధ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వేడుకల తొలిరోజు రైతు సదస్సులో భాగంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ…. పూర్వ విద్యార్ధినైన తనకు కళాశాలతో ఏనలేని అనుబంధం ఉందన్నారు.
చదువు నేర్చుకున్న గురువుల (Teachers) ముందే నేడు స్టేజి మీద నిలబడి మాట్లాడడం గర్వంగా ఉందన్నారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు నేడు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని, పూర్వ విద్యార్థులందరిని కలుపుకుంటూ, అందరి భాగస్వామ్యంతో మూడు రోజులు వేడుకలు కలిగించడం సంతోషకరమని ఎమ్మెల్యే రాము హర్షం వ్యక్తం చేశారు. కళాశాల ఆవిర్భావానికి కారణమైన రైతులను గుర్తు పెట్టుకొని, వారికి ప్రయోజనకరంగా రైతు సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. సారవంతమైన నెలలతో… మన ప్రాంతం దేశానికే ధాన్యాగారంగా ఉండేదన్నారు. ప్రస్తుతం కొన్ని ఒడిదుడుకులు ఉన్నా సీఎం చంద్రబాబు పాలన అంటేనే రైతులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇవాళ నిర్వహించిన సదస్సును రైతులు సద్వినియోగం చేసుకుంటూ, వరికి ప్రత్యామ్నాయ పంటలు, యాంత్రీకరణపై దృష్టి పెట్టాలన్నారు.
రైతాంగానికి మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చే శాస్త్రవేత్తలకు ఎటువంటి సహాయం కావాలన్నా.. తాను అందిస్తానన్నారు. భూసారాన్ని పెంచడంతో పాటు లాభసాటి వ్యవసాయంపై రైతాంగం అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్ ల డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, బూరగడ్డ శ్రీకాంత్, ఏఎన్ఆర్ కళాశాల కమిటీ పెద్దలు, వజ్రోత్సవ వేడుకల కమిటీ పెద్దలు, పెద్ద సంఖ్యలో రైతులు(Farmer) , కళాశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
