45 ఏళ్ల ప్రస్థానానికి స్వస్తి..

45 ఏళ్ల ప్రస్థానానికి స్వస్తి..

జన జీవన స్రవంతిలోకి ప్రసాద్ రావు
చంద్రన్న స్వగ్రామం వడ్కాపూర్
మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ

పెద్దపల్లి, అక్టోబర్ 28 (ఆంధ్రప్రభ): మావోయిస్టు (Maoist) పార్టీ మరో అగ్రనేత లొంగిపోయాడు.. ఇప్పటికే వరుస లొంగబాట్లతో ఎదుదెబ్బలు తగులుతున్న మావోయిస్టు పార్టీకి మంగళవారం పెద్దపల్లి జిల్లాకు చెందిన మరో కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్ రావు (Pulluri Prasad Rao) అలియాస్ చంద్రన్న అలియాస్ సోమన్న అలియాస్ శంకర్న కూడా గుడ్బై చెప్పారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఆయన ఎదుట లొంగిపోయారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ చంద్రన్న స్వగ్రామం కాగా, 45 ఏళ్ల క్రితమే విప్లవ భావాలకు ఆకర్షితులై మావోయిస్టు పార్టీవైపు అడుగులు వేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా అజ్ఞాతంలో ఉన్న ఆయన లొంగుబాటు పెద్దపల్లి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

కుటుంబ నేపథ్యం..

పెద్దపల్లి జిల్లా (Peddapally district) జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన పుల్లూరి ప్రసాదావు అలియాస్ చంద్రన్న గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1976- 77లో పదవ తరగతి వి ద్యనభ్యసించారు. పుల్లూరి శ్రీనివాసరావు, వరాలమ్మ దంపతులకు ప్రసాద్ రావు రెండో కుమారుడు. తండ్రి శ్రీనివాసరావు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. కొన్నేళ్ల క్రితమే చంద్రన్న తల్లిదండ్రులు మరణించారు. విప్లవ బాట పట్టిన చంద్రన్న ఇప్పటివరకు వెనుదిరిగి చూడలేదు. కాగా, అన్నయ్య అశోక్ రావు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. తమ్ముడు తిరుపతిరావు, సోదరి అంజలి గోదావరిఖని ఎన్డీసీసీలో ఉంటున్నారు.

1978 నుంచే విప్లవ భావాలకు ఆకర్షితులైన పుల్ల ప్రసాద్ రావు వడివడిగా ఆ దిశగా అడుగులు వేశారు. 1979లో పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలో ఇంటర్ చదివిఏ సమయంలొ నే రాడికల్ స్టూడెంట్ యూనియన్ కార్యకలాపాలకు ఆకర్షితులయ్యారు. 1980లో పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిన పుల్లూరి ప్రసాదరావు కిషనీకి అనుచరుడిగా పనిచేశారు. 1981లో పీపుల్స్ వార్లో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 1983లో కమాండర్ స్థాయికి వెళ్లారు. 1992లో ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 2008లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కవి టీ సభ్యుడయ్యారు. దాదాపు 17 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు. కాగా, 1989లో పార్టీలో డివిజన్ కమిటీ సభ్యురాలు కుర్చంగి మోతి బాయి అలియాస్ రాధక్కను ఆయన వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2013లో రాధక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరెస్టు కాగా, 2015లో బెయిల్పై వచ్చి ఆదిలాబాద్ జిల్లాలోని స్వగ్రామంలో నివసిస్తున్నారు.

17 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న చంద్రన్న ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో అగ్రనేత బండ ప్రకాశ్తో పాటు లొంగిపోయారు. అనారోగ్య సమస్యలు కూడా ఆయన లొంగుబాటుకు కారణంగా తెలుస్తోంది. ప్రసాదావుపై రూ. 25 లక్షల రివార్డు ఉంది. లొంగుబాటు సందర్భంగా చంద్రన్న మాట్లాడుతూ మా సిద్దాంతం ఓడిపోలేదని, దానిని ఓడించడం ఎవరి తరం కాదన్నారు. ఇది లొంగుబాటు కాదని, అభివృద్ధిలో కలిసి పని చేసేందుకు వచ్చామన్నారు. ఇప్పటివరకు ఉద్యమంలో పీడిత తాడిత ప్రజల కోసమే పని చేశానని, భవిష్యత్తులో కూడా ప్రజల కోసమే పని చేస్తానని స్పష్టం చేశారు. కాగా, పోలీసుల ఎదుట లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులపై ఎలాంటి చర్యలు ఉండవని డీజీపీ స్పష్టం చేశారు.

Leave a Reply