వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) కొనసాగుతున్నాయి. భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) లో భాగంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో ఇవాళ ఎదురుకాల్పులు జరిగాయి. వివరాల్లోకి వెళితే.. గంగలూర్ ప్రాంతంలో డీఆర్జీ జవాన్లు, లోకల్ పోలీసులతో కలిసి కూబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే వారికి మావోయిస్టులు ఎదురుపడగా.. ఇరుపక్షాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్ ఇద్దరు మావోయిస్టులు (Two Maoists) అక్కడికక్కడే మృతిచెందగా.. మరికొందరికి తీవ్ర గాయలైనట్లుగా తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌ను జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
కాగా, గరియాబంద్ జిల్లా (Gariabandh district) లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. మైన్‌పూర్ పోలీస్‌స్టేషన్ (Mainpur Police Station) పరిధి భాలూ డిగ్గి సమీప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసు అధికారులకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. దీంతో కోబ్రా, గరియాబంద్ జిల్లాకు చెందిన ఈ-30, స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్‌టీఎఫ్) భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి.

