Annavaram | ఏజ్ బార్ వ్యక్తితో పెళ్లి – అడ్డం తిరిగిన పెళ్లికుమార్తె

అన్న‌వ‌రం – ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలో వివాహ వేడుకను భక్తులు అడ్డుకున్నారు. నేటి ఉద‌యం ఒక వివాహ‌మండపంలోని పెళ్లి పీటల మీద కూర్చున్న పెళ్లికూతురు ఏడుస్తుండడంతో భక్తులు, భద్రతా సిబ్బంది జోక్యం చేసుకున్నారు. ఏం జరిగిందని ఆరా తీయగా.. తనకన్నా రెట్టింపు వయసున్న వ్యక్తితో బలవంతంగా పెళ్లిచేస్తున్నారని ఆ యువతి వాపోయింది. తన వయసు 22 సంవత్సరాలు కాగా, వరుడి వయసు 42 ఏళ్లు అని చెప్పింది.

దీంతో భక్తులు వివాహాన్ని నిలిపివేసి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. వధూవరులతో పాటు వారి కుటుంబ సభ్యులను స్టేషన్ కు తరలించి విచారించారు.. అంత పెద్ద వ‌య‌స్సు ఉన్న వ్య‌క్తితో తాను వివాహం చేసుకోన‌ని పెళ్లికుమార్తె తెగేసి చెప్పింది.. పెళ్లి చేసుకోకుండా ఇలాగైన ఉంటాన‌ని,ఈ పెళ్లి మాత్రం వ‌ద్ద‌ని తేల్చేసింది.. ఈ విష‌యాన్ని త‌న కుటుంబ స‌భ్యుల‌కు ముందే చాలా సార్లు చెప్పాన‌ని, అయినా బ‌ల‌వంతంగా త‌న‌కు ఈ వివాహం చేస్తున్నార‌ని పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇచ్చింది.. దీంతో ఈ వివాహ క్ర‌తువుకి బ్రేక్ ప‌డింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *