అన్నా మీ ఓటు మాకే… అభివృద్ధి మా బాధ్యత – శైలజ నర్సయ్య గౌడ్..

అన్నా మీ ఓటు మాకే… అభివృద్ధి మా బాధ్యత – శైలజ నర్సయ్య గౌడ్..
మోత్కూర్, ఆంధ్రప్రభ : అన్నా మీ ఓటు మాకే.. అభివృద్ధి మా బాధ్యత అంటూ 7 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గనగాని శైలజ నర్సయ్య గౌడ్ లు సోమవారం ఇంటింటికి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తమకు ఒక్కసారి అవకాశం కల్పించి.. కౌన్సిలర్ గా గెలిపిస్తే 7 వ వార్డును పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిల సహకారంతో వార్డులో అధిక నిధులు తీసుకువచ్చి.. అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నారు.
వార్డులో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, విద్యుత్ స్తంభాలు, పారిశుధ్య నిర్వహణ, చెత్తకుండీలో ఏర్పాటు, మౌలిక సదుపాయాలు, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఎల్లుండి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చేయి గుర్తుపై ఓటు వేసి.. తమను అత్యధిక మెజార్టీతో ఏడో వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని అభ్యర్తిస్తున్నారు.
