Ankireddygudem | ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
అంకిరెడ్డిగూడెంలో శ్రీనురెడ్డి ఇంటింటి ప్రచారం
Ankireddygudem | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్‌గా అందరి మద్దతుతో పోటీ చేస్తున్నతనను గెలిపిస్తే అభివృద్ధిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని పర్నె శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం గ్రామంలో ఇంటింటికీ తిరిగి హామీ ఇస్తూ ఓట్లను అభ్యర్థించారు. గ్రామ పంచాయతీలోని సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులను అందజేయడం జరుగుతుందని, తనకు ఓట్లు వేసి సర్పంచ్‌గా గెలిపిస్తే అధిక నిధులను రాబట్టి గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ప్రచారంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల గ్రామ పంచాయతీ ఎన్నికల ఇన్చార్జి రమణగోని శంకర్, బత్తుల జంగయ్య గౌడ్, కడారి ఐలయ్య యాదవ్, పార్టీ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు పర్నె శివారెడ్డి తదితర నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

