Anjaya | ఆశీర్వదించి గెలిపించండి..

Anjaya | ఆశీర్వదించి గెలిపించండి..

ఎంపీ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా..
బిజ్వార్ బీజేపీ సర్పంచ్ అభ్యర్థి అంజయ్య

Anjaya | ఊట్కూర్, ఆంధ్రప్రభ : బిజ్వార్ ప్రజలు ఆశీర్వదించి ఓటు వేసి గెలిపిస్తే ఎంపీ నిధులతో గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని బిజ్వార్ బీజేపీ, బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొల్లంపల్లి అంజయ్య అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త‌న‌ను గెలిపిస్తే ఎంపీ డీకే అరుణ ప్రత్యేక నిధులతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

ప్రజలకు సేవకుడిగా పనిచేసి రుణం తీర్చే భాగ్యం కల్పించాలని అన్నారు. మాజీ సర్పంచు కుమారుడు ఆంజనేయులుగౌడ్, బీఆర్ఎస్ నాయకుల మ‌ద్ద‌తుతో ఎన్నికల బరిలో ఉన్నానని, ప్రజలనమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ.. విద్య, వైద్య, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాన‌న్నారు. ఎంపీ డీకే అరుణ బిజ్వార్ గ్రామం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నార‌ని, తాను గెలిస్తే బిజ్వార్ అభివృద్ధికి నాంది పలుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజప్ప, వెంకటేష్ గౌడ్ జగదీష్, పిరికి వెంకటేష్, పత్తి ఆంజనేయులు, కుక్కలు వెంకటప్ప, పిరికి ఆంజనేయులు రామలింగం గౌడ్, అశోక్ తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply