Anil Ravipudi | మనసు మార్చుకున్నాడా..?

Anil Ravipudi | మనసు మార్చుకున్నాడా..?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అనిల్ రావిపూడి అంటే.. హిట్ మిషన్. ఏ సినిమా చేసినా బొమ్మ బ్లాక్ బస్టరే అనేట్టుగా ఉంది. అందుకనే.. అనిల్ తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు, స్టార్ ప్రొడ్యూసర్స్.. ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అనిల్ రావిపూడి.. ప్రీక్వెల్, సీక్వెల్ తీయను.. ఎందుకంటే.. తీసిన కథనే మరోసారి తీస్తున్నట్టుగా అనిపిస్తుందని ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పుడు అనిల్ మార్చుకున్నాడని.. బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. అనిల్ ప్లాన్ ఏంటి..?

Anil Ravipudi

వరుస విజయాలతో దూసుకెళుతున్న అనిల్ రావిపూడి.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సీక్వెల్ తీయాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు.. అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే.. నెక్ట్స్ ఈ సినిమానే ఉంటుందని ప్రచారం జరిగింది. ఈ విషయం పై అనిల్ స్పందిస్తూ.. సీక్వెల్, ప్రీక్వెల్ తీస్తే.. తీసిన సినిమానే తీస్తున్నట్టుగా ఉంటుంది. అందుచే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సీక్వెల్ తీయాలి అనుకోవడం లేదు. వెంకీతో కొత్త కథతో సినిమా చేస్తాను. ఆల్రెడీ పాయింట్ వచ్చేసిందని చెప్పారు. త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసి షూటింగ్ స్టార్ట్ చేసేందుకు అనిల్ ప్లానింగ్ లో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

Anil Ravipudi

ఇదిలా ఉంటే.. అనిల్ రావిపూడి మనసు మార్చుకున్నట్టున్నాడు. ఓ ఇంటర్ వ్యూలో.. బాలయ్య భగవంత్ కేసరి గురించి స్పందించాడు. ఈ సినిమా తనకి స్పెషల్ అని.. ఫ్యాన్స్ నుంచి వస్తున్న రిక్వెస్ట్ మేరకు భగవంత్ కేసరి మూవీకి సీక్వెల్ కానీ.. ప్రీక్వెల్ కానీ.. తీస్తానని చెప్పారు. అంతే కాకుండా.. భగవంత్ కేసరి పోలీసాఫీసర్ గా మారక ముందు ఏం జరిగింది..? ఆయన గతం ఏంటి..? అనే పాయింట్ తో ప్రీక్వెల్ చేస్తే చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెప్పారు.

Anil Ravipudi

మెగాస్టార్ చిరంజీవితో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి.. ఇప్పుడు బాలయ్యతో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చేలా భగవంత్ కేసరి ప్రీక్వెల్ చేస్తానని చెప్పడం ఆసక్తిగా మారింది. ఇది బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఈ సినిమా వస్తే.. అభిమానులకు నిజంగా పండగే. అయితే.. ఈ ప్రీక్వెల్ పై క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Anil Ravipudi

CLICK HERE TO READ కింగ్ 100లో రొమాన్స్‌..

CLICK HERE TO READ MORE

Leave a Reply