Anemia | ఆరోగ్య ప‌థంలో ప‌య‌నించాలి..

Anemia | ఆరోగ్య ప‌థంలో ప‌య‌నించాలి..

  • జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌..

Anemia | పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : విద్యార్థి దశ నుండే ఆరోగ్య సూత్రాలను పాటించటం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన సాధ్యపడుతుందని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. జాతీయ సులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం పెనుగంచిప్రోలు జడ్పి హైస్కూల్ లో విద్యార్థులకు జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి 1 – 19 సంవత్సరాల వయసున్న పిల్లలకు తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయడం జరుగుతోంద‌న్నారు. చిన్నారుల్లో రక్తహీనత, పోషకాల లోపాలకు కారణమైన నులి పురుగులను నివారించి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు అల్బెండజోల్ మాత్ర ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

చిన్నారులు కూడా శుభ్ర‌త‌కు సంబంధించి మంచి ఆల‌వాట్ల‌ను పెంపొందించుకోవాల‌న్నారు. భోజనానికి ముందు, తరువాత, అడుకున్న తరువాత చేతుల‌ను బాగా శుభ్రం చేసుకోవాల‌ని సూచించారు. శ‌రీరంలో నులిపురుగులు ఉండటం వల్ల అనేక రకాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని, అందువ‌ల్ల జాగ్ర‌త్త‌గా ఉండాలని జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ అన్నారు.

  • చిన్న‌నాటి నుంచే ఆరోగ్య ప‌థంలో ప‌య‌నించాలి..

విద్యార్థి దశ నుండే ఆరోగ్య సూత్రాలను పాటించటం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన సాధ్యపడుతుందని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. జాతీయ సులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం పెనుగంచిప్రోలు జడ్పి హైస్కూల్ లో విద్యార్థులకు జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి 1 – 19 సంవత్సరాల వయసున్న పిల్లలకు తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయడం జరుగుతోంద‌న్నారు.

చిన్నారుల్లో రక్తహీనత, పోషకాల లోపాలకు కారణమైన నులి పురుగులను నివారించి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు అల్బెండజోల్ మాత్ర ఎంతో ఉపయోగపడుతుందన్నారు. చిన్నారులు కూడా శుభ్ర‌త‌కు సంబంధించి మంచి ఆల‌వాట్ల‌ను పెంపొందించుకోవాల‌న్నారు. భోజనానికి ముందు, తరువాత, అడుకున్న తరువాత చేతుల‌ను బాగా శుభ్రం చేసుకోవాల‌ని సూచించారు. శ‌రీరంలో నులిపురుగులు ఉండటం వల్ల అనేక రకాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని, అందువ‌ల్ల జాగ్ర‌త్త‌గా ఉండాలని జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ అన్నారు.

Leave a Reply