Andhraprabha | సమాజంలో ఆంధ్రప్రభకు సుస్థిర స్థానం…

Andhraprabha | సమాజంలో ఆంధ్రప్రభకు సుస్థిర స్థానం…

  • ఆంధ్రప్రభ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీ.ఎస్.ఆర్

Andhraprabha | భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఆంధ్రప్రభ దినపత్రిక నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం పొందుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) అన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రభ 2026 నూతన క్యాలెండర్‌ను కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్‌తో కలిసి ఆవిష్కరించి ఆంధ్రప్రభ యాజమాన్యానికి, రిపోర్టర్‌లకు, పాఠకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆంధ్రప్రభ పత్రిక(Andhraprabha Patrika)కు సమాజంలో ఎంతో గొప్ప ఆదరణ ఉందని, స్వాతంత్ర ఉద్యమం ముందు నుండే ఈ పత్రికను పాఠకులు ఎంతో ఆదరిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రభ పత్రిక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా ఎంతో ప్రబావవంతంగా పని చేస్తుందని కొనియాడారు. నేటి డిజిటలైజేషన్ కాలంలో ఆంధ్రప్రభ ఎప్పటి వార్తలు అప్పుడే వెబ్, డిజిటల్ ఎడిషన్ ద్వారా తాజా వార్తలు ప్రజలకు చేరవేస్తూ ప్రజాహితం కోసం కృషి చేస్తుందన్నారు.

ఎన్నో మానవీయ కథనాలు, అభివృద్ధికి సంబంధించిన ప్రభుత్వ విధానాలను ప్రచురిస్తూ సమాజ అభివృద్ధి కోసం ప్రజల తరుపున విశేష కృషి చేస్తుందన్నారు. ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రభ పత్రిక మంచి గుణాత్మక కథనాలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి(Development) కార్యక్రమాలను వెలుగులోకి తెచ్చి మరింత మన్ననలు పొందాలన్నారు.

సమాజాన్ని మరింత చైతన్యం చేయాలని ఆ దిశగా నేటి తరానికి విలువైన కథనాలు అందించాలని సూచించారు. అలాగే జిల్లాలో ప్రభుత్వం చేపట్టే అనేక అవగాహన, ఇతర కార్యక్రమాలపై మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎంతో శ్రమకు ఓర్చి కృషి చేస్తున్న ఆంధ్రప్రభ యాజమాన్యానికి, ప్రతినిధులకు శుభాకాంక్షలు(Best wishes) తెలిపారు.

Andhraprabha |

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ భూపాలపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పావుశెట్టి శ్రీనివాస్, ఆర్ సీ ఇంచార్జ్ బెల్లం తిరుపతి, కాటారం ఆర్ సీ ఇంచార్జీ అరిగెల జనార్దన్, రిపోర్టర్‌లు బుర్ర చక్రపాణి గౌడ్, పసునూటి రవి, పాలిశెట్టి నరేష్, రెవెల్లి నాగరాజు, దామెర దివాకర్, నాయకులు బుర్ర కొమురయ్య, అప్పం కిషన్, గడ్డం రమేష్ తదితరులు ఉన్నారు.

Leave a Reply