Andhra Prabha SPL Story | చమురు కంపెనీల నష్టాలు.. ప్రభుత్వ చర్యలు..

Andhra Prabha SPL Story | చమురు కంపెనీల నష్టాలు.. ప్రభుత్వ చర్యలు..
Andhra Prabha SPL Story | యుద్ధం తర్వాత చమురు ధరల భారీ పెరుగుదల
సరఫరా, డిమాండ్ మరియు మార్కెట్ ఎకానమీ ప్రభావం
వినియోగదారులు మరియు సబ్సిడీపై చర్చ
స్పెక్యులేటర్లు, కొరత మరియు బ్లాక్ మార్కెట్ వాదనలు
Andhra Prabha SPL Story | అమెరికా – ఇజ్రాయెల్‌లు ఇరాన్ పై యుద్ధాన్ని ప్రారంభించిన తర్వాత బ్రెంట్ క్రూడ్ ధర బ్యారల్‌కి 120 డాలర్లకు పెరిగింది. ఈ యుద్ధం ఇలా కొనసాగితే, అది 150 డాలర్లకు పెరగవచ్చునని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నేచురల్ గ్యాస్ ధరలు ఆసియాలోనూ, యూరప్‌లోనూ 54 శాతం నుంచి 63 పెరిగింది. జెట్ ఫ్యూయల్ ధరలు బ్యారల్‌కి 200 డాలర్లు పెరిగింది. డీజిల్ ధర బ్యారల్‌కి 180 డాలర్లకు పెరిగింది. సరఫరా తగ్గితే, డిమాండ్ లేకపోతే మార్కెట్ ఎకనమీ పడిపోవచ్చు. ఇది 2002 సంవత్సరం నాటి అనుభవం. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు అంతగా పెరగలేదు. మార్కెటింగ్ కంపెనీల ద్వారా ధరలో తేడాను ప్రభుత్వం తాను భరిస్తూ ఉండటం వల్ల ధరలో తేడా కనిపించడం లేదు. వినియోగదారుల పై భారం పడకుండా చూడటం, అంటే వినియోగదారులను రక్షించడమా? అనే ప్రశ్న తలెత్తుతుంది. అంతిమంగా ఆ భారమే వారి పైనే మోపినట్టు అవుతుంది. సరఫరాలో లోపాలు ఏర్పడితే, సరఫరా తగ్గితే, వినియోగదారులు వస్తువు వినియోగాన్ని తగ్గించుకోవల్సి ఉంటుంది.

ఉత్పత్తిదారులు మరింత ఎక్కువగా సరకులను మార్కెట్‌కు తీసుకుని రావల్సి ఉంటుంది. ఉదాహరణకు ఉల్లి ధరనే తీసుకుంటే… ఉల్లి కొరత ఏర్పడినప్పుడు, వినియోగాన్ని తగ్గించుకోమని ప్రభుత్వం నుంచి సలహా అవసరం లేదు. దాని బదులు మరేదో వాడుకుని రోజు గడుపుతారు. ఈలోగా మార్కెట్లోకి కొత్త స్టాక్ విడుదల అవుతుంది. ధర తగ్గుతుంది. ఇదొక మెకానిజం. అలాగే, చమురు ధరల విషయంలో కూడా ఇదే పద్ధతి. పెట్రోల్ ధర పెరిగినప్పుడు, వినియోగదారులు వాహనాలను తక్కువ వాడతారు. పరిశ్రమలు ఇంధన సామర్థ్య పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. సరఫరా వైపు తీసుకుంటే ప్రతిదాలికి ప్రత్యామ్నాయం ఉంటుంది. ధరలను అణచి పెడితే, పేదలకు ఇంధన సబ్సిడీ ఫలితాలు అందవు. మధ్య తరగతి, సంపన్న వర్గాలకు మాత్రం అమితంగా ఆ ఫలితాలు లభిస్తాయి.
ధరలకు వ్యతిరేకంగా వాదనలు : ఇందుకు రెండు వాదనలు వినిపిస్తున్నాయి. మన దేశంలో పేదలు తమ ఆదాయంలో ఇంధనం కోసం అసమతూకంగా ఖర్చుచేస్తూ ఉంటారు. సబ్సిడీ పై పరిమితి ప్లాట్‌గా విధిస్తే, సబ్సిడీ ఫలితం అన్ని వర్గాలకు లభిస్తుంది. సరఫరా తగ్గి, కొరత ఏర్పడితే, రేషన్ దుకాణాల వద్ద పెద్ద క్యూలు కనిపిస్తాయి. బ్లాక్ మార్కెట్లో ధరలు పెరుగుతాయి. ప్రజలకు అందుబాటులో ఉండవు. రెండవ వాదన ఏమంటే, స్పెక్యులేటర్ల వల్ల ధరలు పెరుగుతాయని. కొరత వల్ల ధరలు పెరగడం లేదు. చమురును బ్లాక్ మార్కటీర్లు దాచి పెట్టి కొరతను సృష్టిస్తున్నారు. కొరత అనే దానిని స్పెక్యులేటర్లు కృత్రిమంగా సృష్టిస్తున్నారు. స్పెక్యులేటర్ల పై చర్యలు తీసుకుంటే, సరకు బ్లాక్ మార్కెట్‌కి తరలి వెళ్ళే అవకాశం ఉండదు. సరకును నిల్వచేయడం వల్ల వ్యయం పెరుగుతుంది.

ధరలు పెరిగినప్పుడు, సరకును మార్కెట్లోకి విడుదల చేసినట్లయితే, ధరలు తగ్గుతాయి. ధరలను నియంత్రించి అవసరమైనప్పుడు విడుదలచేయడం వల్ల వినియోగదారులకు మేలు జరుగుతుంది. చమురు కంపెనీలపై ప్రభావం: అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా, రిటైల్ మార్కెట్లో వాటి ప్రభావం కనిపించడం లేదు. దీని ప్రభావం చమురు కంపెనీలపైన. ప్రభుత్వం అధీనంలోని చమురు కంపెనీలపైన. వాటికి వచ్చే లాభాల మార్జిన్లు తగ్గుతున్నాయి. ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసిఎల్లు చమురు ధరలను స్థిరీకరించడం వల్ల 20,000 కోట్ల నష్టాన్ని చవి చూశాయి. వాటికి వచ్చే మార్కెటింగ్ మార్జిన్లు బాగా తగ్గడం వల్ల అవి నష్టాలకు లోనయ్యాయి. ఈ నష్టాలన్నీ బ్యాలెన్స్ షీట్లో మరింత పెరుగుతాయి. ప్రభుత్వం ఇటీవల స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కి పది రూపాయిల వంతున తగ్గించింది. దీంతో చమురు కంపెనీలకు కొంత ఊరట లభించింది. ఈ కేటాయింపుల వల్ల భారం కిందికి సమానంగా పంపిణీ అవుతుందా అనేది జరిగితే, అంతిమంగా వినియోగదారులపై భారం తగ్గుతుంది.
- రేణుక సానే Renukasane@resanering
అనలిస్టు, ఎకానమి
