సూర్యాపేట, ఆంధ్రప్రభ : ఓ పెద్ద డాక్టర్ అయి ఉండి కూడా తల్లిదండ్రులను పట్టించుకోకపోవడంతో 70 ఏళ్ల వృద్ధుడికి ఇబ్బందిగా మారింది. కుటుంబం గడవడం కష్టమయ్యింది. ఈ క్రమంలో “కనికరం లేని దశరథ.. కనికరించు ” అనే శీర్షికన ఆంధ్రప్రభ సూర్యాపేట జిల్లా ఎడిషన్‌లో వచ్చిన కథనానికి జిల్లా ఎస్పీ నరసింహ స్పందించారు. ఆ కుటుంబంపై కరుణ చూపించారు. కుమారుడు డాక్టర్ అయి ఉండి…తవుర్యకు ఉన్న ఆస్తులు అమ్మి తన కుమారుడు దశరథ్‌ను డాక్టర్‌గా చదివించాడు. అలాగే ఇద్దరు ఆడపిల్లలను పెళ్లిళ్లు చేశాడు. చిన్న కుమారుడు వ్యవసాయ కూలీగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.
అయితే .. పెద్ద కుమారుడు దశరథ ఓ డాక్టర్ అయి ఉండికూడా తల్లిదండ్రులను పట్టించుకోకపోవడంతో ఆరుపదుల వయస్సులో అతని తల్లి కూలీచేసి కుటుంబాన్ని సాకుతోంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రభ వెలుగులోకి తీసుకొచ్చింది. స్పందించిన ఎస్పీ…ఆంధ్రప్రభలో ప్రచురితమైన “కనికరం లేని దశరథ… కనికరించు ” అనే శీర్షికతో ప్రచురితైమన కథనానికి ఎస్పీ స్పందించారు.
70 ఏళ్ల వృద్ధుడిపై కరుణ చూపించారు. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ రాజశేఖర్, ఎస్సై శ్రీకాంత్ దుబ్బాతండాలో ఉన్న తావుర్య ఇంటికి వెళ్లి పరిస్థితి తెలుసుకున్నారు. తావుర్య కుమారుడు డాక్టర్ దశరథతో పోలీసులు ఫోన్‌లో మాట్లాడి కౌన్సెలింగ్ ఇచ్చారు. రెండు రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తండ్రిని చూస్తానని పోలీసులకు అతను హామీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి పోలీసులు నిత్యావసర సరుకులు అందజేశారు.