నెల్లూరు : జిల్లా టీపీ గూడూరు మండలం అనంతపురం వాటర్ బేస్ కంపెనీలో అమోనియా లీక్ అయింది. దీంతో ఊపిరాకడక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే బయటకు పరుగులు తీశారు. కానీ 10మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కంపెనీ పరిసరాల్లోనూ అమోనియా వ్యాపించడంతో ముందు జాగ్రత్తగా మాస్కులు ధరించారు. మరికొంత మంది ఇంటి తలుపులు, కిటికీలు వేసుకుని లోపలే ఉండిపోయారు. అయితే ఈ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది.. అమోనియా లీక్‌ను అదుపు చేశారు. దీంతో స్థానికులు ఊపిరపీల్చుకున్నారు.