American-Journalist-Kidnapped : లేడీ జర్నలిస్ట్ కిడ్నాప్ Andhra Prabha News

American-Journalist-Kidnapped : లేడీ జర్నలిస్ట్ కిడ్నాప్ Andhra Prabha News
- ఇంటర్నేషనల్ సంచలనం
- బాగ్దాద్ లో కలకలం
- ఇరాక్ ఆపరేషన్ షురూ
- ఎవరో తేలని కిడ్నాపర్లు
- రంగంలోకి అమెరికా నిఘా అధికారులు
- కతైబ్ హిజ్బుల్లాపై అనుమానం
- ఆమె సీఐఏ ఏజెంటు : మిలీషియా ఆరోపణలు
- అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన
( ఆంధ్రప్రభ, బాగ్దాద్ ప్రతినిధి)
ఇరాక్‌లో అమరికన్ మహిళ జర్నలిస్టును గుర్తుతెలియని వ్యక్తుల కిడ్నాప్ సంచలనం రేపింది. ఈ ఘటనపై ఇటు ఇరాక్, అటు అమెరికా ప్రభుత్వాలు తీవ్రంగా స్పందించాయి. ఆమె విడుదల కోసం ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభమైంది., వివరాలు ఇలా ఉన్నాయి, అమెరికా వార్తా సంస్థ ‘అల్-మానిటర్ రిపోర్టర్ షెల్లీ కిటిల్సన్‌ను మంగళవారం సాయంత్రం ఇరాక్‌లోని బాగ్దాద్ నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు మీడియా సంస్థ ప్రకటించింది. ఈ ఘటనపై అమెరికా ప్రభుత్వం స్పందించింది. ఆమెను విడుడల కొసం ఇరాక్ ప్రభుత్వం కలసి తమ నిఘా సంస్థ పని చేస్తోందని అమెరికా అధికారి తెలిపారు.
American-Journalist-Kidnapped : బాగ్దాద్ లో కలకలం
మహిళ జర్నలిస్టు అపహరణకు కారకులెవరలో కచ్చిత సమాచారం వెలగులోకి రాలేదు. కిడ్నాపర్ల డిమాండ్లు ఇంకా బయటకు రాలేదు. ఇరాన్ అనుబంధ సంస్థ కతైబ్ హిజ్బుల్లా మిలీషియా బృందంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి,. గంతలో ఈ మిలీషియా సంస్థ జర్నలిస్టు కిటిల్సన్‌ను హెచ్చరించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. అమెరికా విదేశాంగ సహాయ కార్యదర్శి డైలాన్ జాన్సన్ తన Xలో ఖాతాలో స్పందించారు. “ఈ అపహరణలో ప్రమేయం ఉందని భావిస్తున్న, ఇరాన్ అనుకూల మిలిషియా గ్రూప్ కతైబ్ హిజ్బుల్లాతో సంబంధాలు ఉన్న ఒక వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు” అని తెలిపారు. .
American-Journalist-Kidnapped : కతైబ్ హిజ్బుల్లాపై అనుమానం
కతైబ్ హిజ్బుల్లా సంస్థ ఇరాన్ మద్దతు ఇస్తున్న ఒక మిలిషియా సమూహం, ఇది అమెరికన్లను లక్ష్యం చేసుకుంది. మధ్యప్రాచ్యం ఆఫ్ఘనిస్తాన్‌లో నైపుణ్యం ఈ జర్నలిస్ట్ కిటిల్సన్ అనతి కాలంలోనే సెన్సేషనల్ రిపోర్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆమె రచనలు అంతర్జాతీయ, అమెరికన్ ఇటాలియన్ పత్రికలలో ప్రచురితమయ్యాయి.
American-Journalist-Kidnapped : అయినా భేఖాతర్..
ఆమెను అపహరించి హతమార్చటానికి కతైబ్ హిజ్బుల్లా కుట్ర పన్నినట్టు అమెరికా ప్రభుత్వం ఇటీవల కిటిల్సన్‌ను హెచ్చరించింది. ఆమె అప్పటికే ఇరాక్‌లో రిపోర్టింగ్ చేస్తున్నారు. కిటిల్సన్‌కు వ్యతిరేకంగా ఇరాన్ ప్రాక్సీ నుండి ఇ వస్తునన బెదిరింపులను అమెరికా, ఇరాక్ అధికారులు గమనిస్తున్నారు . ఆమెను కిడ్నాప్ చేసి చంపేస్తారనే అనుమానంతో కొన్ని వారాల కిందటే ఇరాక్ వదిలి వెళ్లానని ఆమెను హెచ్చరించారు.
American-Journalist-Kidnapped : ఆమెను వదిలేయండి
ఆమె పని చేస్తున్న అమెరికా వార్తా సంస్థ ‘అల్-మానిటర్స మంగళవారం కిటిల్సన్ కిడ్నాప్ ను ధృవీకరించింది, ఆమెను “సురక్షితంగా, తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. “ఆమెను సురక్షితంగా, తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నాం. ఈ ప్రాంతం నుంచి ఆమె కీలక రిపోర్టింగ్‌కు మేము అండగా నిలుస్తాం, ఆమె తన ముఖ్యమైన టాస్క్ ను కొనసాగించడానికి త్వరగా తిరిగి రావాలని కోరుతున్నాం,” అని ఆ ప్రకటనలో అల్ మానిటర్స్ పేర్కొంది.
American-Journalist-Kidnapped : ఇరాక్ ఆపరేషన్ షురూ
బాగ్దాద్ నగర కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక విదేశీ మహిళా జర్నలిస్టును అపహరించారని ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ద్రువీకరించింది. ఈ ఘటనలో ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్‌లో ఉపయోగించిన ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యుల్ని పట్టుకుని, ఆమెను విడిపించేందుకు ఒక ఆపరేషన్‌ను ప్రారంభించినట్టు ఇరాక్ ప్రభుత్వం ప్రకటించింది.
American-Journalist-Kidnapped : ఇరాక్ నుంచి వెళ్లిపోండి ..అమెరికా
ఫిబ్రవరి నెలాఖరులో ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి , ఇరాన్ కు మద్దతు తెలిపే మిలిషియా గ్రూపులు అమెరికన్లను కిడ్నాప్ చేస్తాయని .. దేశం విడిచి వెళ్లాలని పదేపదే ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయం అమెరికా పౌరులను హెచ్చరిస్తోంది. “ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాక్‌కు రావొద్దు. ఒకవేళ వస్తే మీరు అక్కడ ఉంటే వెంటనే బయలుదేరండి,” అని రాయబార కార్యాలయం వారాంతంలో ప్రకటించింది. .
