AMERICA | అరాచాకాన్ని సృష్టిస్తారు!

AMERICA | అరాచాకాన్ని సృష్టిస్తారు!

  • అమెరికా దాడులు చ‌మురు ఉత్ప‌త్తి దేశాల‌పై పెత్త‌నం కోస‌మేనా.?
  • 135 ఏళ్లుగా ఇదే ప‌రిస్థితి
  • ప్ర‌పంచంలో అత్య‌ధిక‌ చ‌మురు ఉత్ప‌త్తి దేశాల్లో వెనిజులా ఒక‌టి

AMERICA | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ప్ర‌పంచంలో అగ్ర‌దేశ‌మైన‌ అమెరికా ప్ర‌పంచాన్ని శాసించేలా అడుగులు ముందుకు వేస్తోంది. అమెరికా అధ్య‌క్షుడు ఎవ‌రైనా ఇలాంటి దేశాల‌పై దాడుల‌కు (Attacks) పాల్ప‌డ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. చ‌మురు ఉత్ప‌త్తి దేశాల‌ను త‌మ ఆధీనంలోకి తీసుకుని ప్ర‌పంచాన్ని శాసించాల‌ని అమెరికా చూస్తోంది. ఇటీవ‌ల టారిఫ్‌లు పెంచిన‌ప్పుడు భార‌త్‌కు కూడా అమెరికా ష‌ర‌తులు విధించింది. ర‌ష్యా వ‌ద్ద చ‌మురు ఉత్ప‌త్తులు కొనుగోలు చేయొద్ద‌ని కండిష‌న్ పెట్టింది. అయితే భారత్ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

చ‌మురు ఉత్ప‌త్తి దేశాల‌పై అమెరికా దృష్టి సారించి అంత‌ర్జాతీయంగా వ్యాపారాన్ని త‌మ ఆధీనంలో చేయాల‌ని ఆదేశిస్తుంది. దీనివ‌ల్ల అమెరికాకు న‌చ్చిన దేశాల‌కు చ‌మురు ఉత్ప‌త్తులు స‌ర‌ఫ‌రా చేస్తుంది. లేకుంటే సరఫరా ఆపేస్తుంది. చ‌మురు ఉత్ప‌త్తుల‌ను డాల‌ర్‌లో కొనుగోలు చేయాల‌ని కండిష‌న్ కూడా పెడుతోండి.. దీనివ‌ల్ల అంత‌ర్జాతీయంగా డాల‌ర్ (Dollar) మార‌క విలువ కూడా పెరుగుతుంది. అందుకే త‌మ ఆధీనంలోకి చ‌మురు వ్యాపారాన్ని తీసుకుంటుంది. అప్ప‌టికీ ఆయా దేశీధినేత‌లు మొండికేస్తే పాల‌నా వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకుంటుంది. అప్ప‌టికీ జ‌న‌ బ‌లం ఉన్న నాయ‌కుడైతే ఏదో సాకు చెప్పి దాడుల‌కు తెగ‌బ‌డుతుంది. గ‌తంలో ఇరాక్ దేశాధినేత‌, ఇప్ప‌డు వెనెజువెలా దేశాధినేత ఇందుకు ఉదాహ‌ర‌ణ చెప్పొచ్చు.

AMERICA | ప్ర‌పంచంలోనే అత్య‌ధిక చ‌మురు ఉత్ప‌త్తి దేశం వెనెజువెలా.

వెనెజువెలాలో ఎంత చమురు ఉందంటే…అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (Admission) ప్రకారం, వెనెజువెలాలో 300 బిలియన్‌ బ్యారెళ్ల కన్నా ఎక్కువ చమురు నిక్షేపాలు ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం చమురు నిల్వల్లో ఇది 20 శాతం. దీని విలువ రూ.1,557 లక్షల కోట్లు అని అంచనా. ఈ చమురు హెవీగా ఉంటుంది, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సిమెంట్‌ పరిశ్రమలు, నౌకలు, రోడ్డు నిర్మాణం, వాటర్‌ ప్రూఫింగ్‌ల కోసం కూడా వాడతారు. అమెరికాకు 50 బిలియన్‌ బ్యారెళ్ల చమురు నిక్షేపాలు ఉన్నాయి. ఇది లైట్‌, స్వీట్‌ క్రూడ్‌. పెట్రోలు తయారీకి ఇది సరైనదే. ఇతర ఉత్పత్తుల తయారీకి అనువైనది కాదు. వెనెజువెలాలో రోజుకు 1 మిలియన్‌ బ్యారెళ్ల చమురు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అంటే ప్రపంచం మొత్తం మీద రోజుకు ఉత్పత్తి అయ్యే చమురులో కేవలం 0.8 శాతం మాత్రమే వెనెజువెలాలో ఉత్పత్తి అవుతుంది.

AMERICA | అమెరికా ఆంక్షలు..

గతంలో వెనెజువెలా చమురుకు అతి పెద్ద కొనుగోలుదారు అమెరికా(America). ఛావెజ్‌ విధానాలు, ప్రకటనల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఆ తర్వాత వెనెజువెలా చమురుకు అతి పెద్ద కొనుగోలుదారుగా చైనా మారింది. చమురుకు బదులుగా 10 బిలియన్‌ డాలర్ల రుణాలను చైనా ఇచ్చింది. వెనెజువెలా చమురును అమ్ముతున్నప్పటికీ, ఆదాయాన్ని సంపాదించలేకపోతున్నది.

AMERICA | అమెరికా దుశ్చ‌ర్య‌లు…

హవాయి(1893): యూఎస్‌ మద్దతుతో రాణి లిలియుకలానిని అమెరికన్‌ వ్యాపారవేత్తలు గద్దె దించారు. ఇది అమెరికా పసిఫిక్‌ ఆధిపత్యానికి దారి తీసింది.

  • క్యూబా, ప్యూర్టో రికో, ఫిలిప్పీన్స్‌ (1898): స్పానిష్‌-అమెరికన్‌ యుద్ధంలో ఈ ప్రాంతాలను అమెరికా స్వాధీనం చేసుకుంది. లాటిన్‌ అమెరికాలో బనానా వార్స్‌: యు.ఎస్‌. కంపెనీల (యునై-టె-డ్‌ ఫ్రూట్‌ కంపెనీ) ప్రయోజనాల కోసం హోండురాస్‌, నికరాగ్వా, హైతీ, డొమినికన్‌ రిపబ్లిక్లలో యు.ఎస్‌. మిలిటరీ జోక్యం జరిగింది.
  • ఇరాన్‌ (1953): ప్రధాని మొహమ్మద్‌ మొసాదెక్‌ను సీఐఏ నేతృత్వంలోని ఆపరేషన్‌ అజాక్స్‌తో గద్దె దించారు. చమురు జాతీయీకరణ వల్ల బ్రిటిష్‌, అమెరికన్‌ ఆసక్తులు దెబ్బతిన్నాయి. షా పాలన మళ్లీ స్థాపించారు. కానీ ఇది 1979 ఇస్లామిక్‌ విప్లవానికి దారి తీసింది. అమెరికా పట్ల వ్యతిరేకత పెరిగింది.
  • గ్వాటెమాలా (1954): యునైటెడ్‌ ఫ్రూట్‌ కంపెనీ భూముల సంస్కర కారణంగా ఎన్నికైన అధ్యక్షుడు జాకోబో ఆర్బెంజ్‌ను సీఐఏ నేతృత్వంలోని ఆపరేషన్‌ పీబీసక్సెస్‌తో తొలగించారు. ఫలితంగా 36 ఏళ్ల సివిల్‌ వార్‌, 2 లక్షల మరణాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి.
  • క్యూబా (1961): బే ఆఫ్‌ పిగ్స్‌ దండయాత్ర విఫలమైంది. ఫిడెల్‌ కాస్ట్రోను తొలగించడానికి సుశిక్షితులైన సీఐఏఅధికారులను ఉపయోగించారు.
  • దక్షిణ వియత్నాం (1963): అధ్యక్షుడు దిన్‌ దియేమ్‌ను సీఐఏ మద్దతుతో హత్య చేశారు. ఇది యూఎస్‌- వియత్నాం యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది.
  • చిలీ (1973): ఎన్ని-కై-న అధ్యక్షుడు సాల్వడార్‌ అల్లెండేను సీఐఏ మద్దతుతో గద్దె దించారు. ఆగస్టో పినోచెట్‌ నేతృత్వంలో నియంతృత్వ పాలనను తీసుకొనివచ్చారు. ఫలితంగా 3000 మంది మరణించారు. వేలాది మందిని హింసించారు.
  • బ్రెజిల్‌ (1964), బొలీవియా (1971), ఇండోనేషియా (1965-66)లో సీఐఏ మద్దతుతో జరిగిన కుట్రలు వేలాది మరణాలకు దారి తీశాయి.
  • ఇరాక్‌ (2003): సద్దాం హుస్సేన్‌ను గద్దె దించారు. భారీ నష్టాన్ని కలిగించే అణ్వాయుధాలు(డబ్ల్యూఎండీలు) లేవని తేలింది. ఫలితం: పెచ్చరిల్లిన హింసాత్మక ఘటనలు, ఐసిస్‌ ఉగ్రమూక ఆవిర్భావం, మిలియన్ల మరణాలు, ప్రాంత అస్థిరత్వం.
  • లిబియా (2011): నాటో (యు.ఎస్‌. నేతృత్వం) మద్దతుతో గడాఫీని తొలగించారు. దేశం అస్తవ్యస్తమైపోయింది. సివిల్‌ వార్‌, టెర్రరిజం పెరిగాయి.
  • ఆప్ఘనిస్తాన్‌ (2001): తాలిబన్‌ను తొలగించారు. కానీ 20 ఏళ్ల తర్వాత తాలిబాన్‌ మళ్లీ అధికారంలోకి వచ్చారు.

CLICK HERE TO READ అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ ఇంటిపై దాడి

CLICK HERE TO READ MORE

Leave a Reply