తెరమీదకు ఆంబులెన్స్ రిఫేర్ కథ

  • జిల్లా ఆసుపత్రికి తరలింపులో జాప్యం
  • మృతదేహాన్ని అప్పగించిన అదే ఆంబులెన్స్
  • కుటుంబ సభ్యులు ఆగ్రహం

ఆంధ్రప్రభ, ముంచంగి పుట్టు, పాడేరు జిల్లా : పాడేరు జిల్లా ముంచంగిపుట్టు పంచాయితీ ఇందిర కాలనీకి చెందిన టొంగి ఆదినారాయణ ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఆస్వస్థతకు గురికాగా చికిత్స నిమిత్తం హుటాహుటిన కుటుంబ సభ్యులు స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలిచారు. సకాలంలో వైద్య సాయం అందలేదు. ఇక అతడి పరిస్థితి విషమించటంతో పాడేరు జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు.

కానీ అతడిని తరలించటానికి ఆంబులెన్స్ లభించలేదు. ఆసుపత్రి ఆంబులెన్స్ మరమ్మత్తులకు గురి కావటంతో.. మరో 108 వాహనంలో తరలిస్తామని వైద్యులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకూ రోగిని తరలించే 108 వాహనం జాడలేదు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఆదినారాయణ ఊపిరి ఆగిపోయింది. ఇక మృతదేహాన్ని మాత్రం చెడిపోయిన ఆంబులెన్సులో అప్పగించారు.

ఇక్కడే అసలు గొడవ ప్రారంభమైంది. మృతదేహాన్ని అప్పగింరటంతో కుటుంబ సభ్యులు, బంధువులు కోపోద్రిక్తులయ్యారు. వైద్యులు , సిబ్బందితో కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. సీహెచ్సీ సూపరిండెంట్ డాక్టర్ గీతాంజలి కనీసం చలనం లేకుండా వ్యవహరించి పొంతన లేని సమాధానాలు చెబుతూ మృతుని కుటుంబ సభ్యులకు సముదాయించేందుకు ప్రయత్నించడంతో ఆమెపై మండిపడ్డారు.

ఈ సందర్భంగా మృతుడి భార్య సావిత్రి , కుటుంబ సభ్యులు టి ధనుష్ కుమార్, లైలారాణి , కోమలి రాణి, అజయ్ తీవ్ర ఆగ్రహంతో సీహెచ్ సీలోని డిప్యూటేషన్ వైద్య అధికారి సకాలంలో వైద్య సేవలు అందించలేదని, తీవ్ర అసస్థతకు గురైనప్పటికీ మెరుగైన వైద్య సేవలు నిమిత్తం జిల్లా ఆసుపత్రిలో తరలించడంలో జాప్యం వల్లే మృతి చెందాడని మృతుడి కుమారుడు టీ ధనుష్ కుమార్ మాట్లాడుతూ, అంబులెన్స్ మరమ్మతులు గురైన కారణాలు చెప్పి ఆదివారం మధ్యాహ్నం నుంచి వేరే 108 వాహనం వస్తుందని చెప్తూ కాలయాపన చేసి వైద్యులు నిర్లక్ష్య ధోరణి వ్యవహరించారని ఆరోపించారు.

కుటుంబ సభ్యులు పలువురు మాట్లాడుతూ అంబులెన్స్ సక్రమంగా లేనప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలు పంపి అంబులెన్స్ మరమ్మతలకు చర్యలు తీసుకోవాల్సిన ఆసుపత్రి సూపరిండెంట్ కు బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ఇదే తరహాలో గతంలో సీహెచ్ సీ వైద్యులు సక్రమంగా వైద్య సేవలు అందించలేక, ఉన్నత వైద్యు సేవల కోసం జిల్లా ఆసుపత్రిలో తరలించే నిర్లక్ష్యపు ధోరణితో ఆదివాసి గిరిజనులు పదుల సంఖ్యలో మృతి చెందుతున్నారని ఆమెను ప్రశ్నించారు.

మరమ్మలకు గురైన అంబులెన్స్ మృతదేహం తరలింపుకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీహెచ్సీ లో విధులు నిర్వహిస్తున్న వైద్యుల మొండి వైఖరి పై డీఎంహెచ్ఓ , ఐటిడిఏ పీఓ, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి సీహెచ్ సీ వైద్యులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరించారు.

Leave a Reply