బస్సే అంబులెన్స్‌గా…!

బస్సే అంబులెన్స్‌గా…!
- డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రాణరక్షణ
- పిడుసుతో కుప్పకూలిన ప్రయాణికుడు…
- ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా…బస్సుతోనే ఆసుపత్రికి తరలింపు
- ఆర్టీసీ డ్రైవర్ ధైర్య నిర్ణయం…ప్రాణాపాయం నుంచి బయటపడిన వృద్ధుడు
- వరంగల్ 1డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కిషన్ రావుపై ప్రశంసల వెల్లువ
- ఆర్టీసీపై నమ్మకాన్ని పెంచిన స్టేషన్ ఘన్ పూర్ లోని సంఘటన
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : ప్రమాద సమయంలో మనుషుల ప్రాణాలు కాపాడే నిజమైన హీరోలు ఎవరో మరోసారి నిరూపించిన ఘటన గురువారం స్టేషన్ ఘన్‌పూర్‌లో చోటుచేసుకుంది. ప్రయాణికులు, ఆర్టీసీ డ్రైవర్ నిజమైన హీరోలు అని ఈ ఘటన స్పష్టం కనిపిస్తుంది.వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జనగా మ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన పూలసుల ఉప్పలయ్య (66) వరంగల్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు లో పాలకుర్తి నుంచి హన్మకొండకు ప్రయాణిస్తున్నారు.

స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలోని అండర్‌బ్రిడ్జ్ వద్ద అకస్మా త్తుగా ఆయనకు పిడుసు రావ డంతో కుప్పకూలిపోయారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో డ్రైవర్ కిషన్ రావు చూపి న మానవత్వం ఒక ప్రాణాన్ని కాపాడే దిశగా ముందుకు నడిపించింది. ప్రయాణికుల విజ్ఞప్తిని గమనించిన డ్రైవర్ కిషన్ రావు ఒక్క క్షణం ఆల స్యం చేయకుండా చర్యలు తీసు కున్నారు. 108 అంబులెన్స్‌కు కాల్ చేసినప్పటికీ అది అందుబాటులో లేకపోవడంతో, పరిస్థితిని అంచనా వేసి బస్సునే అంబులెన్స్‌గా మార్చి బాధితుడిని సమీప ప్రభుత్వ ఆసు పత్రికి వేగంగా తరలించారు.

అస్పత్రి లో వైద్యులు ప్రధమ చికిత్స అందించారు. దింతో వరంగల్ 1డిపోకు చెందిన ఆర్టీసీ బస్ ద్వారా జరిగిన ఈ ఘటన అక్కడున్న వారిని కది లించింది. అత్యవసర సమ యంలో మానవత్వంతో స్పందించిన డ్రైవర్ కిషన్ రావు చర్యలను ప్రయాణికులు, స్థానికులు ప్రశంసించారు. ప్రాణం కంటే మించినది ఏదీ లేదని ఆయన తన చర్యల ద్వారా మరోసారి నిరూపించారు. ఈ ఘట నపై ప్రయాణికులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ డ్రైవర్‌ను అభినం దించారు. ఇలాంటి సిబ్బంది వల్లే ప్రజల్లో ఆర్టీసీపై నమ్మకం మరింత బలపడుతుందని వారు తెలిపారు.
