విద్య‌తో పాటు క్రీడ‌ల్లో రాణించాలి…

విద్య‌తో పాటు క్రీడ‌ల్లో రాణించాలి…

  • క్రీడా ప్ర‌తిభను ప్ర‌ద‌ర్శించిన విద్యార్థులు…

లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : విద్యార్థులు విద్యతో పాటు క్రీడారంగంలో రాణించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. ఈ రోజు మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల మైదానంలో నిర్వహించిన తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్(Residential Education Institute) జిల్లాస్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి భాగ్యవతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడా రంగం(Sports Sector)లో రాణిస్తూ సామాజిక దృక్పథం కలిగి ఉండాలని తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని కలిగిస్తాయని, స్నేహభావం పెంపొందుతుందని, నాయకత్వ లక్షణాలు అలవడతాయని తెలిపారు.

క్రీడలతో చదువులో ఏకాగ్రత పెరుగుతుందని, ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాల(Government Schools)ల్లో విద్యార్థులకు త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ప్రహరీ గోడ ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తుందని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మధ్యాహ్నం భోజనంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

2025-26 ఏడాదికి మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడంతో విద్యార్థులు పోటీలలో పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారని అభినందించారు. ఈ పోటీలలో జిల్లాలోని గుడిపేట బాలుర జట్టు మొదటి బహుమతి, నిర్మల్ జిల్లా బాలుర జట్టు(Nirmal District Boys Team) ద్వితీయ బహుమతి గెలుపొందారని తెలిపారు. విద్యార్థులు చదువులో సైతం ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని, ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply