Allu Arjun | ఆ ఆరుగురిలో నెక్ట్స్ ఎవరితో..?
Allu Arjun, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో (Atlee) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాని కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇంత వరకు తెర పై రాని విభిన్న కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అనుకున్న ప్లాన్ కంటే కాస్త ముందుగానే ఈ మూవీ కంప్లీట్ అయ్యేలా ఉందని సమాచారం. ఇదిలా ఉంటే.. బన్నీ నెక్ట్స్ మూవీ కోసం ఆరుగురు దర్శకులు వెయిటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. ఆ ఆరుగురు దర్శకులు ఎవరు..? బన్నీ నెక్ట్స్ మూవీ ఎవరితో..?
Allu Arjun | బన్నీ, భన్సాలీ.. కాంబోలో మూవీ
పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే.. అంటూ బన్నీ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. దీంతో నార్త్ జనాలకు పుష్పరాజ్ తెగ నచ్చేశాడు. ఇక బాలీవుడ్ మేకర్స్ అయితే.. బన్నీ ఎప్పుడు డేట్స్ ఇస్తే.. అప్పుడు సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు. బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali).. బన్నీతో సినిమా చేయాలి అనుకుంటున్నారు. ఆమధ్య సంజయ్ లీలా ఆఫీస్ కి వెళ్లి బన్నీ కలవడం జరిగింది. దీంతో బన్నీ, భన్సాలీ.. కాంబోలో మూవీ అంటూ అటు నార్త్ లో, ఇటు సౌత్ లో ప్రచారం ఊపందుకుంది. అయితే.. ఈ క్రేజీ కాంబో మూవీ ఉంటుందా..? లేదా..? అనేది తెలియాల్సివుంది.

బన్నీ కోసం వెయిటింగ్ లో ఉన్న మరో డైరెక్టర్ బాసిల్ జోసెఫ్. ఈ మలయాళ దర్శకుడు ఐకాన్ స్టార్ కు సూపర్ మేన్ స్టోరీ చెప్పాడని.. ఈ కథకు బన్నీ ఓకే చెప్పారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. ఈ ప్రాజెక్ట్ ఉందా..? లేదా..? ఉంటే.. ఎప్పుడు ఉంటుంది అనేది తెలియాల్సివుంది. బన్నీ కోసం ఎదురు చూసే దర్శకుల్లో ప్రశాంత్ నీల్ (Prasanth Neel) కూడా ఉన్నారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. దీని తర్వాత ప్రభాస్ తో సలార్ 2 చేయాలి. ఆతర్వాత బన్నీతో సినిమా చేయాలి అనేది ప్రశాంత్ నీల్ ప్లాన్ అని సమాచారం.

సూపర్ స్టార్ రజినీకాంత్ తో (Rajinikanth) జైలర్ సినిమా తెరకెక్కించి.. బ్లాక్ బస్టర్ అందించాడు నెల్సన్ దిలీప్ కుమార్. ఇప్పుడు రజినీతో జైలర్ సీక్వెల్ జైలర్ 2 తెరకెక్కిస్తున్నారు. ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కూడా బన్నీతో సినిమా చేయడం కోసం వెయిటింగ్ లో ఉన్నాడని అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో టాక్ బలంగా వినిపిస్తోంది. అసలు పుష్ప 2 సినిమా కంప్లీట్ అయిన తర్వాత బన్నీ.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలి. అయితే.. బన్నీ.. అట్లీతో సినిమా చేయడానికి ఓకే చెప్పడంతో.. త్రివిక్రమ్ వెంకీతో ఓ మూవీ, ఎన్టీఆర్ తో ఓ మూవీ ఫైనల్ చేసుకున్నారు. అయిన్పటికీ.. బన్నీ, త్రివిక్రమ్ కాంబో మూవీ ఉందని.. ఈ కాంబోలో సినిమా ఎప్పుడైనా సెట్ అయ్యే ఛాన్స్ ఉందని బన్నీకి అత్యంత సన్నిహితుడు బన్నీ వాసు ఓ ఇంటర్ వ్యూలో తెలియచేశారు.
ఇదిలా ఉంటే.. తాజాగా కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakaraj) పేరు గట్టిగా వినిపిస్తుంది. ఇటీవల లోకేష్ కనకరాజ్.. బన్నీకి కథ చెప్పాడట. స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్ ఉందని బన్నీ చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ కాంబోలో మూవీ కన్ ఫర్మ్ కానుంది టాక్ వినిపిస్తోంది. ఈ ఆరుగురు దర్శకులే కాకుండా.. సందీప్ రెడ్డి వంగ కూడా బన్నీతో సినిమా చేయాలి. ఆల్రెడీ ఈ క్రేజీ కాంబో మూవీని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఇంత మంది వెయిటింగ్ లో ఉన్నా.. తాజా సమాచారం ప్రకారం.. బన్నీ నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది మాత్రం ఇంకా కన్ ఫర్మ్ కాలేదని తెలిసింది. మరి.. ఐకాన్ స్టార్ నెక్ట్స్ మూవీకి ఏ దర్శకుడికి ఛాన్స్ ఇస్తారో..? ఎప్పుడు క్లారిటీ ఇస్తారో.. చూడాలి.

