Alliance | త‌మిళ‌నాడులో మ‌ళ్లీ బిజెపి, అన్నాడిఎంకెల యుగ‌ళ‌గీతం

చెన్నై – తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు ఖరారైంది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేస్తామని పళనిస్వామితో భేటీ అనంతరం కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, అన్నాడీఎంకే కలిసి పోటీ చేయనున్నట్లు ఆయన స్పష్టంగా తెలిపారు.ఈ మేరకు చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, అమిత్ షా తో కలిసి అన్నాడీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎడప్పాడి పళనిస్వామి, బిజెపి రాష్ట్ర శాఖాధ్యక్షుడు అన్నామలైతో పాల్గొన్నారు.ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నాయకత్వంలోనే పొత్తు కొనసాగుతుందని, ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోనే వారు ఎన్నికల బరిలోకి దిగుతారని స్పష్టం చేశారు.


ప‌ళ‌నిస్వామే సిఎం ..

అంతేకాదు.. తమిళనాడులో ఎన్డీయే కూటమి నుంచి సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును కూడా అమిత్ షా ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండానే అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు ఖరారు చేసుకున్నామని అమిత్ షా స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఒక పక్క పళనిస్వామిని, మరో పక్క అన్నామలైని కూర్చోబెట్టుకుని మరీ ఎన్డీయేతో అన్నాడీఎంకే పొత్తును అమిత్ షా ప్రకటించడం గమనార్హం.అన్నాడీఎంకేతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. అధికారం, సీట్ల పంపకాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాలను జోక్యం చేసుకోమని అమిత్ షా పేర్కొన్నారు.

1988లో దివంగత మాజీ సీఎం జయలలిత నేతృత్వంలో బీజేపీ అన్నాడీఎంకే పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు లోక్‌సభలో భారీ విజయాన్ని నమోదు చేసిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు. ఒక దశల్లో ఈ కూటమి తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు 30 స్థానాలు గెలుచుకుందని ఆయన చెప్పారు. తమిళనాడు ఎన్నికల్లో ఎన్డీయే సులభంగా గెలుస్తుందని షా ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply