Allapalli | ఘనంగా భోగి వేడుక‌లు

Allapalli | ఘనంగా భోగి వేడుక‌లు

Allapalli | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని ఆళ్లపల్లి మండలంలో గల చిన్నారి బాలికలు భోగిమంటల వేడుకలను ఘనంగా నిర్వహించారు. మకర సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలో ఎస్సి కాలనీలోని భోగి మంటల కార్యక్రమాలను చేపట్టారు. భోగ భాగ్యాలను అందించే పండుగ భోగి అని, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడానికి మకర సంక్రమణాన్ని సంక్రాంతినని పిలుస్తారని, ఇలాంటి పండుగను కులమతాలకతీతంగా, పార్టీల అతీతంగా జరుపుకోవడం సంతోషదాయమన్నారు.

సంస్కృతి, సాంప్రదాయ పద్ధతిని కొనసాగించే విధంగా సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఎన్నో ఏండ్ల నుండి ఆనవాయితీగా వస్తుందన్నారు. రైతులు సుఖ సంతోషాలతో ఉండి చీకటి నుంచి వెలుగు నింపేలా మకర సంక్రాంతిలోని చెడును ప్రారదోలి వెలుగువచ్చే విధంగా దేశంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు. ప్రత్యేక ముగ్గులు వేసి గొబ్బెమ్మలను అలంకరించి శ్రీకృష్ణుని పూజచేసి భోగి మంటలు ప్రారంభించి నృత్యాలు చేశారు. హరిదాసుకు బియ్యం పోసి కానుకలను అందజేశారు. అనంతరం భోగి మంటల్లో చిన్నారులు ఆనందోత్సవంలో మునిగితేలారు. ఈ కార్యక్రమంలో పరమ డింపు, క్యూటీ, జెస్సికాశ్రీ, డార్శి,మనిషా, నిస్సు, సైని, అక్షయ్, పూజ్యా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply