Allagadda | ఘోర రోడ్డు ప్రమాదం..

Allagadda | ఘోర రోడ్డు ప్రమాదం..
- నలుగురు అక్కడికక్కడే మృతి..
- ట్రావెల్ బస్సు ను డివైడర్ను దాటి ఢీకొన్న కారు..
- శుక్రవారం తెల్లవారుజామున జరిగిన సంఘటన…
- రోడ్డంతా రక్తసిక్తం…
- జాతీయ రహదారిపై ఈ సంఘటన..
Allagadda, నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి పై నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం బత్తులూరు గ్రామ సమీపాన శుక్రవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరు తీవ్ర గాయాలతో ప్రభుత్వాసుపత్రిలో ఉన్నారు. వీరంతా హైదరాబాద్ కు చెందిన వాసులుగా పోలీసులు గుర్తించారు. జరిగిన సంఘటనను బట్టి తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్తున్న క్వాలిస్ కారు ఏపీ 09 ఏ హెచ్0667 అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ట్రావెల్ బస్సు CGR బస్సును ఢీకొట్టింది.
ప్రైవేట్ ట్రావెల్ బస్సు నెంబర్ ఏపీ 01 టీ 5685 హైదరాబాదు నుంచి పుదుచ్చేరికి వెళ్తుంది. ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. కారులో ఆరుగురు ఉన్నారు. డీఎస్పీ ప్రమోద్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు అతివేగమే దీనికి ప్రధాన కారణమని తెలుపుతున్నారు. క్రేన్ సహాయంతో వాహనాలను తరలిస్తున్నారు. వీరిని పోలీసులు గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.

