నేతలంతా అక్కడే…

ఒకప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నిక, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలంటూ ఏ ఎన్నికలకు అయా స్థాయి నాయకుల పాత్ర, ప్రచారం, వ్యూహం అంటూ ఉండేది. రానూ రానూ రాజకీయ రణరంగంలో ఎన్నికల స్థాయి ఏదైనా గెలుపే ప్రధానంగా, పోరాటమే ధ్యేయంగా మారినప్పటి నుండి, ప్రతి ఎన్నికా పార్టీలకు ప్రతిష్టాత్మకమే. ప్రచారం హోరెత్తాల్సిందే. ఆరోపణాస్త్రాలు ప్రత్యర్థులను చెల్లాచెదురు చేయాల్సిందే. అందుకు ఏ స్థాయి నేతలైనా ఆ నియోజకవర్గంలో తిష్ట వేయాల్సిందే. ఎందుకంటే, అధికార పార్టీ అయినా, ప్రతిపక్షమైనా చిన్న చిన్న ఉప ఎన్నికల ఫలితాలను కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తమ భవితవ్యాన్ని చూసుకుంటున్నాయి.
ప్రస్తుతం జరగబోతున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విషయంలో అదే జరుగుతోంది.


జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అయినా, తెలంగాణాలో స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ అయినా, ప్రతిపక్ష బీఆరెస్ అయినా ఒకేతీరుగా తలపడి విజయాన్ని అందుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి, శ్రమిస్తున్నాయి. కానీ ఇదెంత వరకు సమంజసమని ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి ఈ నియోజకవర్గం లో గెలుపు వల్ల ప్రభుత్వం ఉనికికి ఏం తేడా రాదు. బీజేపీకి కూడా పెద్ద మార్పేమీ రాకపోవచ్చు. బీఆరెస్ కి ఈ ఎన్నికల్లో గెలిస్తే నూతనోత్సాహం రావచ్చు. కానీ, ఈ ఎన్నిక ప్రధానంగా అనేక సమీకరణలు, మార్పులు, చేర్పులు…హామీలు, వాగ్దానాలతో అగ్ర నేతలు సైతం ఈ నియోజకవర్గం పైనే దృష్టి పెట్టడం వల్ల మిగతా సమస్యల సంగతేంటని ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

Leave a Reply