సబ్బండ బీసీ వర్గాలు పాల్గొనాలి

సబ్బండ బీసీ వర్గాలు పాల్గొనాలి

నందిపేట్, ఆంధ్రప్రభ : జేఏసీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు(BC Reservations) అమలు చేయాలని కోరుతూ 18వ తారీఖున తెలంగాణ రాష్ట్ర బంద్ పిలుపు మేరకు నందిపేట్. డొంకేశ్వర్(Nandipet. Donkeswar) మండలాల సబ్బండ బీసీ వర్గాలు 18వ తేదిన అన్ని పార్టీల నాయకులు, కుల సంఘాలు, యువజన సంఘాలు, అన్ని రకాల వ్యాపార యజమానులు 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ.. జస్టిస్ ఫర్ బంద్(Justice for Bandh) కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించి నందిపేట్, డొంకేశ్వర్ మండలాల వ్యాప్తంగా 18వ తారీఖున నిర్వహించడం జరుగుతుందని దీనికి వ్యాపార వాణిజ్యవార్త ప్రజా సంఘాలన్నీ, రాజకీయ పార్టీలన్నీ మద్దతు తెలపాలని కోరడం జరిగింది.

స్వచ్ఛందంగా బంద్ పాటించాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంఘం ఆంజనేయులు, జిల్లా నాయకుడు నరాల సుధాకర్(Nara Sudhakar), మచ్చర్ల సాయి ,అన్న సిలిండర్ లింగం, మచ్చల సాగర్, కృష్ణ గౌడ్, నడిపి ముత్యం ,బొడ్డు రాజశేఖర్, భాస్కర్, మురళి, మంతెన మురళి ,డొంకేశ్వర్ చందు, సాంబార్ గిరిధర్, దేవేందర్, శంకర్, సుభాష్, గాండ్ల సంతోష్, దారం సురేష్ ,అశోక్, శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply