Aleru | స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న విద్యార్థులు..

Aleru | స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న విద్యార్థులు..

Aleru, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజిపేట గ్రామంలో జరుగుతున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆలేరు ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా విద్యార్థులు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాల, హై స్కూల్ ప్రాంగణాలలో గడ్డిని, అనవసరపు మొక్కలను తొలగించి ఆ పాఠశాలల విద్యార్థులు నడిచేందుకు వీలుగా శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నల్లబోలు ముత్యాలు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ గ్రామంలో వాలంటీర్లు ర్యాలీని కూడా నిర్వహించారు.

Leave a Reply