ఆలయంలో అన్నదానం..

ఆలయంలో అన్నదానం..
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో అపర ఇంద్రకీలాద్రిగా పేరుపొందిన శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో అన్నదాన కార్యక్రమం శుక్రవారం జరిగింది. అంతకుముందు ఆలయంలో అమ్మవారికి విశేష పూజలను, కుంకుమార్చనలను నిర్వహించగా మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ చైర్మన్ కొలుపుల హరినాథ్, కోశాధికారి బేతి రాములు, గార్లపాటి శ్రీనివాస్, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
