Akhanda 2 | అంచనాలు పెంచేసిన రిలీజ్ టీజర్..

Akhanda 2 | అంచనాలు పెంచేసిన రిలీజ్ టీజర్..

Akhanda 2, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీనుల కాంబోలో రూపొందిన డివైన్ ఎంటర్టైనర్ అఖండ 2 : ది తాండవం(Akhanda 2: The Tandavam) డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నెల 11న ప్రీమియర్లు వుంటాయి. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా గ్రాండ్ రిలీజ్ టీజర్ విడుదలైంది.

Akhanda 2

టీజర్ ప్రేక్షకులను నేరుగా అఖండ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. బాలకృష్ణ అఖండ అవతార్ లో అదరగొట్టారు. భక్తి, శక్తిగా మారి ఉగ్రరూపం దాల్చే అఖండ కథకు పర్ఫెక్ట్ టోన్ సెట్(Perfect tone set) చేస్తుంది. ఆది పినిశెట్టి చేసిన తాంత్రిక క్రతువులు, కుంభమేళా వాతావరణపు గ్లింప్స్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అఖండ యాక్షన్ నెక్స్ట్ లెవల్ లో వుంది. ప్రతి సన్నివేశం ధర్మ సంరక్షకుడిగా అతని పాత్ర గూస్ బంప్స్ తెప్పించింది. అద్భుతమైన శివ తాండవం మెస్మరైజ్ చేసింది.

బోయపాటి శ్రీను టీజర్‌ను విజువల్ గ్రాండియర్(Visually grander) తో ఆధ్యాత్మికంగా అద్భుతంగా రూపొందించారు. ఎస్ థమన్(S Thaman) అద్భుతమైన సంగీతం, 14 రీల్స్ ప్లస్ నిర్మాణ విలువలతో టాప్ క్యాలిటీలో వున్నాయి. మొత్తం మీద, టీజర్ పూర్తిగా గూస్‌బంప్‌లను అందిస్తుంది. BookMyShowలో ఈ చిత్రం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అడ్వాన్స్ టికెట్ సేల్స్ ఆల్ టైమ్ హై రేంజ్ లో సాగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ బుకింగ్స్(Bookings) వేగంగా పెరుగుతుండటం, టికెటింగ్ పోర్టల్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉన్నందున అఖండ 2 మ్యాసీవ్ ఓపెనింగ్‌ దిశగా వెళుతోంది. మరి.. ఓపెనింగ్ లో అఖండ 2 ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.

CLICK HERE TO READ లాభాపేక్ష వల్లే ఇండిగో సంక్షోభం!

CLICK HERE TO READ MORE

Leave a Reply