ముంబైకి షాక్ ఇచ్చిన అజింక్యా ర‌హానే

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : క్రికెట‌ర్ అజింక్యా రహానే ముంబై జ‌ట్టు(Mumbai team)కు షాక్ ఇచ్చాడు. రాబోయే దేశవాళీ సీజన్ (domestic season)కు ముందు అత‌డు ముంబై జ‌ట్టు కెప్టెన్సీ (Mumbai team captaincy) బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇక పై ముంబైలో ఓ ఆట‌గాడిగా మాత్ర‌మే కొన‌సాగుతాన‌ని వెల్ల‌డించాడు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌హానే (Ajinkya Rahane) తెలిపాడు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, కొత్త నాయకుడిని తీర్చిదిద్దేందుకు ఇదే సరైన సమయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశాడు.

ఆట‌గాడిగా కొన‌సాగుతా..
“ముంబై జట్టుకు కెప్టెన్ (captain of Mumbai team)గా వ్యవహరించడం, ఛాంపియన్‌షిప్‌లు గెలవడం నాకు దక్కిన గొప్ప గౌరవం. రాబోయే దేశవాళీ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని, ఒక కొత్త నాయకుడిని సిద్ధం చేయడానికి ఇదే సరైన సమయమని నేను నమ్ముతున్నాను. అందుకే కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను” అని రహానే ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు. అయితే, ఒక ఆటగాడిగా జట్టుకు తన సేవలు అందిస్తూనే ఉంటానని, ముంబైకి మరిన్ని ట్రోఫీలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నాడు.

Leave a Reply