AITUC | దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి..

AITUC | దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి..
AITUC, మునుగోడు, ఆంధ్రప్రభ : కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు, సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను పిలుపునిచ్చారు. ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి దేశవ్యాప్త సమ్మె పోస్టర్‌ను ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విడుదల చేశారు. అనంతరం చాపల శ్రీను మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం–2025, వి.బి.జి-రామ్ జి చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్‌ఐసీలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి వంటి కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ చట్టాలు కార్మికుల హక్కులను హరించే విధంగా ఉన్నాయని, నాలుగు లేబర్ కోడ్‌లు కార్మికులకు “మరణ శాసనం” లాంటివని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, ఉద్యోగులు ఐక్యంగా సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి బెల్లం శివయ్య,భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు పందుల చిన్న నరసింహ, కార్యదర్శి ఈద రాములు, బొల్లు సైదులు, మాలాద్రి, బజారు హమాలి కార్మిక సంఘ నాయకులు చిరంజీవి, వెంకన్న,పెద్దులు,గిరి తదితరులు పాల్గొన్నారు.
