Airplane | అత్యవసర ల్యాండింగ్

Airplane | అత్యవసర ల్యాండింగ్
Airplane | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం నుంచి ఢీల్లీకి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నుంచి ఢీల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో ప్రయాణ మధ్యలో సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో పైలట్లు అప్రమత్తమై ఢీల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
ఈ విమానంలో సుమారు 160మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఆకస్మికంగా జరిగిన ఈ పరిణామంతో ప్రయాణికుల్లో కలకలం రేగింది. అయితే సురక్షితంగా ల్యాండింగ్ జరగడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. విమానాన్ని పరిశీలించేందుకు సాంకేతిక బృందం పనులు ప్రారంభించగా, ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు.
