Air Force | ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి స్థల పరిశీలన

Air Force | అంతర్గాం, ఆంధ్రప్రభ : ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి మార్గం సుగమమవుతుంది. పెద్దపల్లి(peddapalli) పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ చొరవతో రామగుండం విమానాశ్రయ నిర్మాణం (Airport construction) కోసం గురువారం ఎయిర్ ఫోర్స్ అధికారులు స్థల పరిశీలన జరిపారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని గోదావరి తీర ప్రాంతంతో పాటు పెద్దంపేట రైల్వే స్టేషన్ సమీపంలో స్థలాలను అధికారులు పరిశీలించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అవసరం ఉన్న మ్యాప్(map) లను జిల్లా రెవెన్యూ అధికారులు ఎయిర్ ఫోర్స్ అధికారులకు వివరించారు. అధికారులు సంబంధిత స్థలాలు విమానాశ్రయ నిర్మాణానికి అనువుగా ఉన్నాయని ఫిజిబులిటీ రిపోర్ట్(Feasibility Report) ఇస్తే రామగుండం విమానాశ్రయ నిర్మాణానికి అనుమతులు వస్తాయి.

Leave a Reply