పుణ్యక్షేత్రం అభివృద్ధే లక్ష్యం

పుణ్యక్షేత్రం అభివృద్ధే లక్ష్యం
- అమరావతిలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
అమరావతి, ఆంధ్రప్రభ : అమరావతి(Amaravati) రాజీవ్ కాలనీలోని ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్(Bhashyam Praveen) పంపిణీ చేశారు. కాలనీలో ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. పెన్షన్ పొందుతున్నవృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆప్యాయంగా పలకరించారు. ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు సంకల్పమేనని, ప్రభుత్వం పేదవారికి అండగా నిలబడటానికే ఈ పథకాలను తీసుకువస్తోందని ఎమ్మెల్యే ప్రవీణ్ తెలిపారు.
ప్రజలకు మరింత మేలు చేకూరేలా తాము కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. పుణ్యక్షేత్రం అమరావతి అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తానని ఎమ్మెల్యే ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో టీ పార్వతి(MPDO T Parvathi), మండల తాహసీల్దార్ మీసాల డేనియల్(Meesala Daniel), టీడీజీ నాయకులు మంచినేని రాజా, షేక్ జానీ(Sheikh Johnny), గుడిసె కిరణ్ కుమార్, ఆలా వీరబాబు, నల్లిబోయిన రాజశేఖర్ యాదవ్ పాల్గొన్నారు.
