సమస్యల పరిష్కారంలో ఉప సర్పంచ్ లు ముందుండాలి…

సమస్యల పరిష్కారంలో ఉప సర్పంచ్ లు ముందుండాలి…
ఉప సర్పంచ్ ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుబొట్ల కార్తీక్,
చిట్యాల మండల ఉప సర్పంచ్ ల కమిటీ ఎన్నిక
చిట్యాల, ఆంధ్రప్రభ : గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారంలో ఉప సర్పంచులు ముందంజలో ఉండాలని ఉప సర్పంచ్ ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుబొట్ల కార్తీక్, కోరారు. బుధవారం మండల కేంద్రంలో ఉప సర్పంచ్ ల సంఘం భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో చిట్యాల మండల స్థాయి ఉప సర్పంచ్ ల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బొట్ల కార్తీక్,జిల్లా అధ్యక్షులు గట్టు ప్రదీప్ గౌడ్, చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి లు హాజరై మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఉప సర్పంచ్ లు ముందంజలో ఉండాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు ఉప సర్పంచ్ ల ఐక్యతకు క్షేత్ర స్థాయిలో ఉప సర్పంచ్ ల సంఘం నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.
సర్పంచ్ లతో పాటు ఉప సర్పంచ్ లకు కూడా ప్రత్యేక విధులు అప్పచెప్పాలని ఉప సర్పంచ్ లకు గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం చిట్యాల మండల ఉప సర్పంచ్ ల సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు ప్రదీప్ గౌడ్ తెలిపారు.
ఉప సర్పంచుల చిట్యాల మండల అధ్యక్షుడిగా గుంటూరుపల్లి ఉప సర్పంచ్ ముద్దన నాగరాజు,గౌరవ అధ్యక్షులు పులి రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి గా, కేంపల్లి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు, ఏక్ అనిల్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా నల్ల అశోక్, కోశాధికారి గా మర్రి సమ్మక్క,అధికార ప్రతినిధి గా సిరిపురం నరసింగం, కార్యదర్శి గా, తిరుపతి, లను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేగొండ మండల అధ్యక్షులు ఎల్డండి నరేష్, టేకుమట్ల ఉప సర్పంచ్ ఖాదర్, తదితరులు పాల్గొన్నారు.
