సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు…

సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు…

ఎన్ ఏం ఎన్ ఎఫ్ కిట్ల పంపిణీ…

చిట్యాల, ఆంధ్రప్రభ : సేంద్రియ వ్యవసాయంతో పంట దిగుబడి, అధిక లాభాలు సాధించవచ్చునని చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ గుమ్మడి శ్రీదేవి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నేడు ప్రకృతి వ్యవసాయం (సేంద్రియ సాగు)పై అవగాహన, శిక్షణ కార్యక్రమం ఏవో శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్‌లో కరపత్రం, టోపీ, నోట్‌ప్యాడ్, పెన్, గుర్తింపు కార్డు, క్యాలెండర్, జ్యూట్ బ్యాగ్ ఉన్నాయి.

ఈ కిట్లు రైతులకు శిక్షణలో నేర్చుకున్న అంశాలను అమలు చేయడంలో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా రైతుల్లో ప్రకృతి వ్యవసాయం పై చైతన్యం పెంపొందించడంతో పాటు, భవిష్యత్తులో సేంద్రియ సాగును విస్తృతంగా ప్రోత్సహించేందుకు అధికారులు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి చిర్ర సన్నీ, స్వచ్ఛంద సంస్థ జిల్లా నోడల్ అధికారి మణికుమార్, నవాబుపేట గ్రామ సర్పంచ్ పర్లపెల్లి రవి, కృషి సఖి లు పింగిలి జ్యోతి,మోత్కూరి గీత , రైతులు చెక్క నరసయ్య, కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, బిల్లా సత్యనారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply