వాజేడు, జులై 23 ఆంధ్రప్రభ : ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు (Maoist) వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏజెన్సీ పోలీసులు (Agency Police) అప్రమత్తమయ్యారు. రాత్రి వేళల్లో విస్తృతంగా వాహనాల తనిఖీలు (Vehicle inspections) చేపడుతున్నారు.
మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా (Mulugu District) వాజేడు (Wazedu) వెంకటాపురం, ఏటూరు నాగారం, కన్నయ్య గూడెం, మంగపేట మండలాలలోని పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 3వరకు జరగనున్న మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ముందస్తుగా పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యవారిపేట క్రాస్ రోడ్డు సమీపంలో పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ (SI Gurram Krishna Prasad) విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన, ఏజెన్సీలో తమ ఉనికిని కాపాడుకునేందుకు మావోయిస్టులు ఏదో ఒక ప్రాంతంలో దుశ్చర్యలు కు పాల్పడే అవకాశం ఉందని ముందస్తుగా అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా అటువైపుగా వెళ్తున్న వాహనాలను తనిఖీలు నిర్వహించి అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని సేకరించారు. అదేవిధంగా వాజేడు ఎస్సై జక్కుల సతీష్ (Wazedu SI Jakkula Satish) మండపాక వద్ద జాతీయ రహదారిపై వాన తనిఖీలు చేపట్టి అటువైపుగా వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సివిల్ పోలీసులు, సిఆర్పీఏఫ్ సిబ్బంది పాల్గోన్నారు.
