7th ward | మళ్లీ నువ్వే కావాలి…!

ఏడో వార్డులో..
అసలు ఏం జరుగుతుందో…!
కార్యకర్తలు ప్రజలతో.. ఆశావాహుడు పణితీ సైదులు ఆత్మీయ సమ్మేళనం..
వైరా జనవరి 26 (ఆంధ్రప్రభ) మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డులో ఎన్నికలకు సంబంధించి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి… కాంగ్రెస్ పార్టీ ఆ వార్డు ఆశావాహుడు పణితి సైదులు సుమారు రెండు వందల మంది అవార్డుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు… ఆ సమ్మేళనంలో ప్రతి ఒక్కరూ సైదులు పై తమకున్న అభిప్రాయాన్ని పంచుకున్నారు.. గత ఐదేళ్లు ఏడవ వార్డు జనరల్ మహిళ స్థానానికి కేటాయించినప్పటికీ స్థానికుడైన సైదులు వార్డు అభివృద్ధిని ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని.. పోటీ లో విజయ దుందుభి మోగించాడని తెలుపుతూ.. వార్డులో జరిగిన అభివృద్ధి దృశ్యా.. మళ్లీ మీరే కావాలని.. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై తప్పకుండా మీకే అవకాశం ఇవ్వాలని.. అనూహ్య పరిస్థితుల్లో టికెట్ కాంగ్రెస్ పార్టీ కేటాయించినప్పటికీ తాము మీతోనే ఉంటామని తిరిగి గెలిపిస్తామని.. కుటుంబ సభ్యునిగా అందరం కలిసి నడుస్తామని ఏకగ్రీవ తీర్మానానికి వచ్చినట్లు సమాచారం..
